hyderabadupdates.com movies నేను పారిపోను..ప్రశాంత్ కిషోర్

నేను పారిపోను..ప్రశాంత్ కిషోర్

బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రశాంత్ కిషోర్ (PK)కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఇప్పటిదాకా తనకు నిద్ర కూడా సరిగా పట్టలేదని ఆయన నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారిగా ఒప్పుకున్నారు. ‘జన్ సూరజ్’ పార్టీ పెట్టి, తొలి ఎన్నికల్లోనే ఇలాంటి దారుణమైన పరాభవం ఎదురవుతుందని అస్సలు ఊహించలేదట. కానీ, “మనం క్విట్ చేసేంత వరకు ఓడిపోయినట్లు కాదు” అంటూ పీకే తనదైన స్టైల్లో స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇది ముగింపు కాదు, ఆరంభం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు.

ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌గా ఎంతోమందిని గెలిపించిన పీకే, సొంత పార్టీ విషయంలో మాత్రం సర్వేలు చేయించుకోకుండా “బ్లైండ్ గేమ్” ఆడారట. కనీసం 12-15 శాతం ఓట్లు వస్తాయని లెక్కలేసుకుంటే, వచ్చింది మాత్రం కేవలం 3.5 శాతమే. దీనిపై ఆయన క్లారిటీ ఇస్తూ.. బీహార్ ఓటర్లు కులం, మతం, లేదా లాలూ/బీజేపీ భయంతో ఓటేశారని చెప్పారు. తాను కులం, మతం అనే టాపిక్స్ పక్కనపెట్టి, కేవలం ఉద్యోగాల గురించి మాట్లాడానని, అందుకే ఆ ఓటర్లను ఆకట్టుకోలేకపోయానని అంగీకరించారు.

ఇక నితీష్ కుమార్ పార్టీ (JDU) 25 సీట్లు కూడా గెలవదని ఎన్నికలకు ముందు పీకే పెద్ద ఛాలెంజ్ చేశారు. కానీ సీన్ కట్ చేస్తే జేడీయూ 85 సీట్లు కొట్టింది. దీనిపై పీకే స్పందిస్తూ.. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఆడిన “డబ్బు” మాయాజాలమే దీనికి కారణమన్నారు. దాదాపు 1.2 కోట్ల మంది మహిళలకు 10 వేల చొప్పున సాయం అందిందని, ఒక్కో నియోజకవర్గంలో సుమారు 100 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఆ స్కీమ్ ఎఫెక్ట్ వల్లే తన అంచనా తప్పిందని కవర్ చేసుకున్నారు.

ఘోర ఓటమి ఎదురైనా పీకే కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గలేదు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ గతాన్ని గుర్తు చేశారు. “బీజేపీకి కూడా ఒకప్పుడు పార్లమెంట్‌లో రెండే రెండు సీట్లు ఉండేవి. పార్టీ పెట్టిన కొత్తలో ఇలాంటి ఫలితాలు కామనే” అని చెప్పుకొచ్చారు. తాము కులమతాల విషాన్ని చిమ్మలేదని, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే వచ్చామని, అందుకే మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తామని చెప్పారు.

బీహార్ రాజకీయాల్లో మార్పు కోసం తాను 10 ఏళ్లు కేటాయిస్తానని ముందే మాటిచ్చానని పీకే గుర్తు చేశారు. “ఇప్పటికి మూడున్నరేళ్లు అయ్యింది. నేను మూడేళ్లలోనే గెలుస్తానన్న అతి నమ్మకంతో బరిలోకి దిగాను, అది జరగలేదు. అంతమాత్రాన నేను పారిపోను” అని చెప్పారు. వచ్చే ఐదేళ్లు కూడా ఇదే ఉత్సాహంతో ప్రజల్లోనే ఉంటానని, తన పోరాటం ఆగిపోదని పీకే స్పష్టం చేశారు.

Related Post

తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ లో ఏముంది?తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ లో ఏముంది?

తెలంగాణ‌లో సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. స్వ‌ప్నిస్తున్న తెలంగాణ విజ‌న్ డాక్యుమెంటును తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఫ్యూచ‌ర్ సిటీలో ఆవిష్క‌రించారు. ఇటీవ‌ల కాలంలో చెబుతున్న తెలంగాణ‌ను 2047 నాటికి 3 ట్రిలియన్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఆవిష్క‌రించ‌డ‌మే ధ్యేయంగా

Is Tom Brady Dating Alix Earle? Everything We Know About Their New Year’s Eve EncounterIs Tom Brady Dating Alix Earle? Everything We Know About Their New Year’s Eve Encounter

A New Chapter for Tom Brady? Since his high-profile divorce from Gisele Bündchen, Brady has kept his personal life relatively low-key. While Gisele has moved on—marrying Joaquim Valente in December

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట..9 మంది మృతికాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట..9 మంది మృతి

శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య