hyderabadupdates.com movies నేను సంబరాల రాంబాబునైతే…మరి పవన్?

నేను సంబరాల రాంబాబునైతే…మరి పవన్?

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గతంలో సంక్రాంతి సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సంబరాల రాంబాబు అంటూ టీడీపీ, జనసేన నేతలు రాంబాబుపై విమర్శలు గుప్పించారు. ఇక, సోషల్ మీడియాలో అయితే రాంబాబును నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఇంకాస్త ముందుకెళితే పవన్ కల్యాణ్ నటించిన బ్రో చిత్రంలో అంబటి పాత్రను పృథ్వీ పోషించారని దుమారం రేగింది.

కట్ చేస్తే…తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంక్రాంతి సంబరాలలో భాగంగా గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయం నృత్యం చేశారు. దీంతో, ఆ వ్యవహారంపై అంబటి స్పందించారు. సంక్రాంతికి తాను డ్యాన్స్ వేస్తే సంబరాల రాంబాబునా? మరి పవన్ వేస్తే? అని ప్రశ్నిస్తూ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. పవన్ ను ప్రశ్నిస్తూ అంబటి చేసిన ట్వీట్ వైరల్ అయింది.

ఆ ట్వీట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అంబటి వ్యవహార శైలికి, పవన్ వ్యవహార శైలికి చాలా తేడా ఉందని అంటున్నారు. అంబటి అరగంట ఆడియో వైరల్ అయిందని, కాబట్టి మహిళలతో అంబటి డ్యాన్స్ వేసిన వైనం చూసి సంబరాల రాంబాబు అని పేరు వచ్చిందని కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

సంక్రాంతికి నేను డాన్స్ వేస్తే సంబరాల రాంబాబునా?మరి పవన్ డాన్స్ వేస్తే ?@PawanKalyan pic.twitter.com/3VxGOZ9vaB— Ambati Rambabu (@AmbatiRambabu) January 9, 2026

Related Post

15 ఏళ్ల కూటమి పవన్ వ్యాఖ్యల వెనుక పెద్ద రీజనే ఉంది15 ఏళ్ల కూటమి పవన్ వ్యాఖ్యల వెనుక పెద్ద రీజనే ఉంది

రాజకీయాల్లో ఉన్నవారు ఏం మాట్లాడినా చాలా పెద్ద రీజనే ఉంటుంది. దీనికి ఎవరూ అతీతులు కాదు. తరచుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని చెబుతున్నారు. ఎక్కడ ఆయన ప్రసంగించినా

Chiranjeevi & Venkatesh Shock Fans With a Mega Dance Blast Featuring 500 Dancers!Chiranjeevi & Venkatesh Shock Fans With a Mega Dance Blast Featuring 500 Dancers!

Tollywood fans are in for a huge surprise! Megastar Chiranjeevi and Victory Venkatesh, two of the most loved stars in Telugu cinema, are secretly shooting one of the biggest mass