అమరావతి : కొత్త సాంకేతికతతో రైతుల భూములకు పూర్తి రక్షణ కల్పించడం జరుగుతోందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాయవరంలోని వ్యవసాయ క్షేత్రంలో రైతులతో సీఎం ముఖాముఖి మాట్లాడారు. క్యూఆర్ కోడ్, విశిష్ట సంఖ్య ఉన్న, మీ భూమి..మీ హక్కు పేరుతో రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. క్యూఆర్ కోడ్ ద్వారా తక్షణం భూమి వివరాలు తెలుసుకునేలా పట్టాదారు పాస్ పుస్తకాలను రెవెన్యూ శాఖ ముద్రించిందని రైతులకు సీఎం వివరించారు. రైతులు, భూ యజమానుల ఆస్తులకు భద్రత కల్పించేలా కొత్త టెక్నాలజీతో ట్యాంపరింగ్ చేసేందుకు వీళ్ళేకుండా పట్టాదారు పాస్ పుస్తకం తయారు చేసినట్టు చెప్పారు. రీసర్వే పూర్తైన 6688 గ్రామాల్లోని భూములకు సంబంధించి 22.33 లక్షల పాస్ పుస్తకాలు ముద్రించగా… ప్రస్తుతం వాటిని పంపిణీ చేస్తున్నట్టు రైతులతో సీఎం చెప్పారు.
రైతులు, భూ యజమానులకు తప్పుల్లేని కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. అనంతరం మీ భూమి- మీ హక్కు ప్రజావేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పూర్వీకుల నుంచి సంక్రమించిన, స్వార్జితమైన భూమితో రైతులకు ఓ అనుబంధం ఉందన్నారు. కరోనా సమయంలో అంతా సెలవు తీసుకున్నారు. కానీ అందరికీ అన్నం పెట్టే రైతన్నకు సెలవే లేదని వాపోయారు చంద్రబాబు నాయుడు. అలాంటి రైతులకు చెందిన భూ పత్రాల విషయంలో గత పాలకులు పాస్ పుస్తకాల జారీకి సంబంధించి అక్రమాలు చేశారని ఆరోపించారు. తాము వచ్చాక సరిచేసి ఇస్తున్నామని చెప్పారు.
The post న్యూ టెక్నాలజీతో రైతుల భూములకు రక్షణ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
న్యూ టెక్నాలజీతో రైతుల భూములకు రక్షణ
Categories: