ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన తనయుడు అకిరా నందన్ మరోసారి ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. డిసెంబర్ 4వ తేదీన జరగబోయే నేవీ డే ఉత్సవాలకు ముందస్తుగా తూర్పు ప్ర్రాంత నావికాదళ కమాండ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు.
సర్గం 2025 – ఇండియన్ నేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్ లో పవన్ తనయుడు అకిరా నందన్ కూడా హాజరవ్వడం, నాన్న పక్కనే ఉండటంతో ఫ్యాన్స్ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
గతంలో పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి కనిపించారు. పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంలో అకీరా ను కూడా తీసుకు వెళ్లారు. తమిళనాడు తిరుపరకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని సందర్శించిన సమయంలో తనయుడు వెంట ఉన్నారు.
పవన్ కళ్యాణ్ సినీ వారసుడిగా అకీరా ఎంట్రీ కానున్నారు. ఓజీ సీక్వెల్ లో అకీరా ఉంటాడనే ఊహాగానాలు వినిపించాయి. అకీరా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడు. అకీరా నందన్ ని సినిమాల్లో హీరోగా పరిచయం చేసే అవకాశం ఇవ్వమని పవన్ కళ్యాణ్ చుట్టూ పెద్ద పెద్ద నిర్మాతలు తిరుగుతున్నట్లు సమాచారం. మంచి కథ తో హై ప్రొఫైల్ లాంచ్ రెండేళ్ల లో చేస్తారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే. అకీరా ఎంట్రీపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.