hyderabadupdates.com Gallery ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నారా లోకేష్ భేటీ

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నారా లోకేష్ భేటీ

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నారా లోకేష్ భేటీ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌ను క‌లుసుకున్నారు. అసెంబ్లీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఛాంబ‌ర్ కు స్వ‌యంగా వెళ్లారు. కొంత సేపు ఈ ఇద్ద‌రూ కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ఇరువురి మ‌ధ్య తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం. ఇవాళ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం పూర్త‌యిన వెంట‌నే బీఏసీ, ఆ త‌ర్వాత ఎన్డీఏ శాస‌న స‌భాప‌క్ష స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా బ‌డ్జెట్ సమావేశాల‌లో చ‌ర్చించాల్సిన అంశాల‌పై చ‌ర్చించారు నారా లోకేష్. డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ తో పాటు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా ఉన్నారు.
ఇదిలా ఉండ‌గా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో బిజీగా గ‌డిపారు. ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులు, నిలిచి పోయిన నిధుల‌ను మంజూరు చేయాల‌ని కోరారు. ఇదే క్ర‌మంలో చంద్ర‌బాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌ల్ సీతారామ‌న్ , కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ , రైల్వే , ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ , మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ , శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ల‌ను క‌లుసుకున్నారు. చంద్ర‌బాబు వెంట ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు, పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, ఎంపీలు కూడా ఉన్నారు.
The post ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నారా లోకేష్ భేటీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Supreme Court: వాట్సప్‌ లేకపోతే అరట్టై వాడండి – సుప్రీంకోర్టుSupreme Court: వాట్సప్‌ లేకపోతే అరట్టై వాడండి – సుప్రీంకోర్టు

Supreme Court : వాట్సప్‌కు పోటీగా తీసుకొచ్చిన స్వదేశీ మెసేజింగ్‌ యాప్‌ ‘అరట్టై’ పేరు ఇటీవల నెట్టింట మార్మోగుతోంది. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ (Supreme Court) దీని ప్రస్తావన వచ్చింది. వాట్సప్‌ ఖాతా పునరుద్ధరణకు సంబంధించి దాఖలైన ఓ

KTR: కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్KTR: కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

    స్థానిక సంస్థల ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, విపక్షాలు కసరత్తు ప్రారంభించాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అధికార కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉంది.

9 గగన‌తలాలకు దూరంగా ఉండాలి9 గగన‌తలాలకు దూరంగా ఉండాలి

న్యూఢిల్లీ : ప్ర‌స్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ , అమెరికా దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న యుద్ద వాతావ‌ర‌ణ కార‌ణంగా ప‌లు విమానాల రాక పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లుగుతోంది. ఈ త‌రుణంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది డీజీసీఏ. శుక్ర‌వారం విమాన‌యాన సంస్థ‌ల‌కు