hyderabadupdates.com movies ‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్ చేశారు. ఆయ‌న వ‌ల్ల తెలుగు ప్ర‌జ‌ల ఐక్య‌త చెడిపోయే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న సీఎం చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేస్తూ.. సెల్ఫీ వీడియోను విడుద‌ల చేశారు. రెండు తెలుగు ప్ర‌జ‌ల రాష్ట్రాలు భౌతికంగా విడిపోయినా.. శారీర‌కంగా మాన‌సికంగా క‌లిసే ఉన్నాయ‌ని.. ఎలాంటి శ‌తృత్వం లేద‌ని చెప్పారు.

రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్నా.. ఆయ‌న త‌న కుమార్తెను భీమ‌వ‌రం అబ్బాయికి ఇచ్చి వివాహం చేశార‌ని నారాయ‌ణ గుర్తు చేశారు. కాబ‌ట్టి.. శ‌తృత్వాలు లేవు క‌దా! అని వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌తంలో చేగువేరా డ్ర‌స్‌ ధరించి విప్లవకారుడిని అని తిరిగార‌ని చెప్పారు. త‌ర్వాత వేషం మార్చి.. సావార్క‌ర్ శిష్యుడిగా మారార‌ని, ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నార‌ని నారాయ‌ణ అన్నారు.  స‌నాత‌న ధ‌ర్మంలో ఉన్నాడు. కాబట్టి దిష్టి త‌గిలింది.. అనే పదాలు వాడుతున్నాడని వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి త‌గ‌ర‌ని నారాయ‌ణ అన్నారు. ఆయ‌న ఈ ప‌ద‌విని వ‌దిలేసి.. గుడులూ.. గోపురాల చుట్టూ తిర‌గొచ్చ‌ని.. స‌నాత‌న ధ‌ర్మంలో ఉండొచ్చ‌ని అన్నారు. ఆయ‌న రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రిగా త‌గ‌ర‌ని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విబేధాలు రేకిత్తించే విధంగా ఉన్నాయి కాబట్టి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఐ నారాయణ కోరారు.

Related Post

Geetha Madhuri’s Soulful Voice Elevates- Naa Peru ShambhalaGeetha Madhuri’s Soulful Voice Elevates- Naa Peru Shambhala

Aadi Sai Kumar’s upcoming supernatural thriller Shambhala: A Mystical World has swiftly become one of the most discussed projects in recent times. Produced by Rajasekhar Annabhimoju and Mahidhar Reddy under

‘వారణాసి’ కథలో ఆయన హ్యాండ్‘వారణాసి’ కథలో ఆయన హ్యాండ్

రాజమౌళి కుటుంబంలో అందరూ ప్రతిభావంతులే. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు ర‌చ‌యిత‌గా ఎంత గొప్ప పేరుందో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక‌ సోదరుడు కీరవాణి సంగీత ప్ర‌తిభ గురించి ప‌రిచ‌యం అన‌వ‌స‌రం. రాజమౌళి సతీమణి రమ స్టైలిస్టుగా గొప్ప పేరే

ఎస్ఎస్ఎంబి 29 – వారణాసి వార్తలో నిజమెంతఎస్ఎస్ఎంబి 29 – వారణాసి వార్తలో నిజమెంత

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ వరల్డ్ మూవీకి వారణాసి టైటిల్ అనుకున్నట్టుగా వచ్చిన వార్త సోషల్ మీడియాలో గట్టిగానే తిరుగుతోంది. నిజానికి జక్కన్న ఇంకా ఏ పేరుని లాక్ చేయలేదట. ముందు మహారాజ్