hyderabadupdates.com movies పవన్ ఫ్యాన్స్ పంతం పడితే అంతే

పవన్ ఫ్యాన్స్ పంతం పడితే అంతే

ఒకప్పుడు స్టార్ హీరోల అభిమానులు మేమంటే మేము గొప్పని చెప్పుకునేందుకు కొత్త సినిమాల ఓపెనింగ్స్ వాడుకునేవాళ్ళు. ఎవరికి ఎక్కువ వసూళ్లు వస్తే వాళ్ళు గొప్పన్న రీతిలో పామ్ ప్లేట్లు, పుస్తకాలు అచ్చేసి ఉచితంగా పంచేవాళ్ళు. సోషల్ మీడియా లేని కాలం కావడంతో టీ స్టాళ్లు, హోటళ్లు ఈ డిస్కషన్లకు వేదికగా మారేవి.

ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీ వచ్చింది. థియేటర్ దాకా వెళ్లకుండా ఎవరికి సినిమాకు ఎక్కువ బుకింగ్స్ జరుగుతున్నాయో జస్ట్ బుక్ మై షో ఓపెన్ చేస్తే చాలు. గంటలు రోజుల వారీగా ఎంత ట్రెండింగ్ జరుగుతోందనేది నెంబర్లతో సహా చూపిస్తుంది. వాటిని ఫ్యాన్స్ స్క్రీన్ షాట్లు చేసే పెట్టుకుంటున్నారు.

ఇప్పుడిది రీ రిలీజులకు కూడా పాకింది. రేపు జల్సా, మురారి థియేటర్లకు రాబోతున్నాయి. ఇవి రెండు ఆల్రెడీ ఒకసారి పునః విడుదల జరుపుకుని రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టినవే. ఇప్పుడు న్యూ ఇయర్ అకేషన్ తీసుకుని మరోసారి ఆడియన్స్ కి చూపిద్దామని బయ్యర్లు ఇలా ప్లాన్ చేసుకున్నారు.

నిన్న మధ్యాన్నం దాకా మురారి ఆధిపత్యమే ఆన్ లైన్ లో కనిపించింది. జల్సా థర్డ్ పార్టీ రిలీజ్ కావడం వల్ల ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోలేదనే ప్రచారం బాగానే పని చేసింది. కట్ చేస్తే ఇవాళ ఒక్కసారిగా సీన్ లో మార్పొచ్చింది. మురారిని పూర్తిగా డామినేట్ చేస్తూ జల్సా అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతున్న వైనం క్లియర్ కట్ గా కనిపిస్తోంది.

దీనికి కారణాలు లేకపోలేదు. మురారి కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. కృష్ణవంశీ చేసిన కుటుంబ మాయాజాలంని ఇదే ఏడాది ఒకసారి ఆడియెన్స్ ఆస్వాదించారు. తక్కువ గ్యాప్ లో మళ్ళీ తెచ్చేసరికి ఆ వర్గం దూరంగా ఉంది. పోకిరి, ఒక్కడు లాగా మాస్ ప్యాకేజ్ కాకపోవడంతో రెస్పాన్స్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది.

కానీ జల్సా అలా కాదు. సంజయ్ సాహూగా పవన్ కళ్యాణ్ వన్ అఫ్ ది బెస్ట్ నటన జల్సాలో చూడొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ హుషారెత్తే పాటలు, ముఖేష్ ఋషి మాస్ విలనిజం, త్రివిక్రమ్ దర్శకత్వం ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయి. సో మరారి కంటే జల్సా సెలబ్రేషన్ పెద్దదని ఋజువు చేయడానికి పవన్ ఫ్యాన్స్ పట్టిన పంతం గెలిచినట్టే.

Related Post