hyderabadupdates.com Gallery పాట‌లు త‌ప్ప స్కాంలు చేయ‌డం తెలియ‌దు

పాట‌లు త‌ప్ప స్కాంలు చేయ‌డం తెలియ‌దు

పాట‌లు త‌ప్ప స్కాంలు చేయ‌డం తెలియ‌దు post thumbnail image

హైద‌రాబాద్ : ఒక‌టా రెండా ఏకంగా రూ. 210 కోట్ల స్కాం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది సింగ‌ర్ మంగ్లీ. త‌న స్వస్థలం రాయ‌ల‌సీమ‌. కానీ అనూహ్యంగా తెలంగాణకు వ‌చ్చింది. బంజారా క‌మ్యూనిటీకి చెందిన‌ది కావ‌డంతో మెల మెల్ల‌గా జ‌ర్న‌లిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత పాపుల‌ర్ అయ్యింది. అక్క‌డి నుంచి గొంతు బాగుండ‌డంతో పాట‌లు పాడ‌టం మొద‌లు పెట్టింది. ఇక ఆనాటి నుంచి నేటి దాకా వెన‌క్కి చూసుకోలేదు. తెలంగాణ జాన‌ప‌ద పాట‌ల‌తో దుమ్ము రేపింది. త‌న‌తో పాటు త‌న సోద‌రిణి కూడా ఊ అంటావా మావ అంటూ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ ఒక్క పాట‌తో త‌ను కూడా పాపుల‌ర్ అయ్యింది దేశ వ్యాప్తంగా.
తెలుగు, క‌న్న‌డ సినీ రంగాల‌లో మంగ్లీ , సోద‌రి కూడా పాట‌లు పాడుతూ మ‌రింత జ‌నాద‌ర‌ణ పొందారు. ఈ త‌రుణంలో త‌ను ఓ కంపెనీ, ప‌బ్, స్కూల్ పెడ‌తానంటూ మంగ్లీతో పాటు సోద‌రుడు , ఇంకొంద‌రు క‌లిసి మాయ మాట‌లు చెప్పి కోట్లు కొల్ల‌గొట్టిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. బాధితులు సైతం బ‌య‌ట‌కు వ‌చ్చారు. దీంతో మంగ్లీ నోరు విప్పింది. తాను అమాయ‌కురాలిన‌ని, త‌న‌కు ఏ పాపం తెలియ‌దంటూ బుకాయించే ప్ర‌య‌త్నం చేస్తోంది. పంజాగుట్ట పీఎస్ లో త‌న‌పై కేసు న‌మోదు అయ్యింది. ఈ సంద‌ర్బంగా మంగ్లీ మాట్లాడుతూ త‌న‌కు పాట‌లు పాడ‌టం త‌ప్ప స్కాంలు చేయ‌డం తెలియ‌ద‌ని వాపోయింది. తాను త‌ప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్దంగా ఉన్నాన‌ని అన్నారు. డబ్బున్న కుటుంబం నుంచి రాలేదని, పేదరికం నుంచి వచ్చానని, డబ్బు విలువ బాగా తెలుస‌న్నారు.
The post పాట‌లు త‌ప్ప స్కాంలు చేయ‌డం తెలియ‌దు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Nara Lokesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి లోకేశ్‌ సమీక్షMinister Nara Lokesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి లోకేశ్‌ సమీక్ష

    మొంథా తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సచివాలయంలో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మరో 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు

ఏపీ పంచాయ‌తీరాజ్ కు సీఎం చంద్ర‌బాబు కంగ్రాట్స్ఏపీ పంచాయ‌తీరాజ్ కు సీఎం చంద్ర‌బాబు కంగ్రాట్స్

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంతోషం వ్య‌క్తం చేశారు. కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో ప్ర‌గ‌తి ప‌రుగులు తీస్తోంద‌న్నారు. ఇందులో భాగంగా అన్ని రంగాలను మ‌రింత బ‌లోపేతం చేయ‌డంపై ఫోక‌స్ పెట్టామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా కేంద్ర

జగన్ మోహన్ రెడ్డి బ్రతుకే ఒక అరాచకం : కొల్లు ర‌వీంద్ర‌జగన్ మోహన్ రెడ్డి బ్రతుకే ఒక అరాచకం : కొల్లు ర‌వీంద్ర‌

అమరావతి:- జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణంపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నాడని, మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బ తీసిన వ్యక్తి మత్స్యకారుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర గనులు, భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి కొల్లు రవింద్ర మండిపడ్డారు. గురువారం మంగళగిరి తెలుగుదేశం