కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఈ పదవిని చేపట్టి 20 మాసాలు పూర్తయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల ఇప్పటి వరకు సాధించిందేంటి అని చూస్తే పెద్దగా ఏమీ కనిపించడం లేదని సొంత పార్టీ సీనియర్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.
మరోవైపు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానన్న షర్మిలకు గ్రాఫ్ పెరగకపోవడం మరో ఇబ్బందిగా మారింది. మొత్తంగా ఈ పరిణామాలు షర్మిల రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయన్నది వాస్తవం.
కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీని రూట్స్ నుంచి అభివృద్ధి చేస్తానని షర్మిల ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఆమె ఒక్కరోజు కూడా పరిశీలించలేదు. పర్యవేక్షించలేదు. దారిలో పెట్టే విధంగా చర్యలు కూడా తీసుకోలేదు.
తన వాయిస్‌ను సొంతానికి వాడుకున్నారన్న వాదనను బలపరుచుకున్నారు. ఇది ఏ పార్టీకైనా మంచిది కాదు. ఉదాహరణకు చంద్రబాబు వైసీపీ హయాంలో అనేక వేధింపులకు గురయ్యారు. కానీ ఆయన సమయం, సందర్భాన్ని బట్టి దీనిని ప్రస్తావిస్తారు.
ప్రజల కోణాన్ని, ప్రజల సమస్యలను పట్టించుకుని అడుగులు వేయడమే నాయకుల, పార్టీల ప్రధాన లక్షణం. ఈ విషయంలో షర్మిల వేసిన అడుగులు వివాదానికి దారితీశాయి. సొంత నేతలే ఆమెను పక్కన పెట్టారు.
ఫలితంగా ఇప్పుడు షర్మిల తాను మారానని, ప్రజల కోసం పార్టీ కోసమే పనిచేస్తున్నానని చెబుతున్నా అనుకున్నంత ఈజీగా ఎవరూ ఆమెను నమ్మడం లేదు. ఇదే ఆమెకు ఇప్పుడు శాపంగా మారింది. ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేసినా పట్టు మని పది మంది సీనియర్లు కూడా రావడం లేదు.
ఇక ప్రతి రెండేళ్లకు కాంగ్రెస్ పార్టీ తన పార్టీ ఇన్‌చార్జ్‌లను మారుస్తూ ఉంటుంది. ఒక్కోసారి వారినే కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఆయా నాయకులు గ్రాఫ్‌పై అంచనాలు తెప్పించుకుంటుంది.
ఇలా ఏపీ చీఫ్ షర్మిల విషయంలో కూడా నివేదిక ఇవ్వాల్సి వస్తోంది. దీనిని బట్టి ఆమెను కొనసాగిస్తారు లేదా బాగుందని భావిస్తే ఆమెనే కొనసాగిస్తారు. కానీ ప్రస్తుతం షర్మిల గ్రాఫ్ పుంజుకోలేదు. పైగా నాయకులు వెళ్లిపోయారు. చాలా మంది నిశ్శబ్దంలో ఉన్నారు.
దాంతో సాధ్యమైనంత వేగంగా గ్రాఫ్‌ను పెంచుకునేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారట.