hyderabadupdates.com movies పిఠాపురానికి పెద్ద కొడుకుగా పవన్ కల్యాణ్

పిఠాపురానికి పెద్ద కొడుకుగా పవన్ కల్యాణ్

పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని తన వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండాలనే ధ్యేయంతో ఆయన నిరంతరం స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

చిన్న సమస్యైనా, పెద్ద సమస్యైనా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం ఆయన పని తీరుకు ప్రత్యేకతగా నిలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 42 మంది అనాథ చిన్నారులకు తన జీతం మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందిస్తున్న పవన్ కళ్యాణ్, తాజాగా మరో ఇద్దరు చిన్నారులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఈ ఇద్దరు చిన్నారులు రెండేళ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయి పూర్తిగా నిరాధారులయ్యారు. ఉండటానికి సొంత ఇల్లు కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తమ దుస్థితిని సామాజిక మాధ్యమాల ద్వారా వీడియో సందేశంగా తెలియజేయగా, ఆ వీడియో ఉప ముఖ్యమంత్రిని కదిలించింది. వెంటనే స్పందించిన ఆయన ప్రతి నెలా ఒక్కొక్కరికి తన జీతం నుండి రూ.5 వేల చొప్పున, ఇద్దరికీ రూ.10 వేల ఆర్థిక సహాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు ఆదేశించారు.

అంతేకాకుండా, ఆ చిన్నారులకు తక్షణం పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని స్పష్టమైన సూచనలు చేశారు. వారి విద్యాభవిష్యత్తు దృష్ట్యా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌కు బాధ్యత అప్పగించారు.

నిరాధార చిన్నారులకు భరోసా ఇవ్వడమే కాకుండా, వారి భవిష్యత్తును సురక్షితం చేసే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం పిఠాపురం ప్రజల్లో సానుకూల స్పందన రేపుతోంది. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా, ఒక బాధ్యతగల కుటుంబ సభ్యుడిలాగా వ్యవహరిస్తున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Related Post

Amidst Dhurandhar success, Akshaye Khanna EXITS from Ajay Devgn’s Drishyam 3- ReportAmidst Dhurandhar success, Akshaye Khanna EXITS from Ajay Devgn’s Drishyam 3- Report

Actor Akshaye Khanna, who recently received widespread acclaim for his performance in Dhurandhar, is reportedly no longer associated with Drishyam 3. According to industry reports, the actor has decided to