hyderabadupdates.com movies పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్

పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను వీక్షించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. లోకేష్ క్రికెట్ లవర్ అని ముందు నుంచి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ మ్యాచ్ చూడడానికి వెళ్లారు.

ఐతే దీని మీద ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద రాద్దాంతం చేస్తోంది. ప్రభుత్వ ఖర్చులతో లోకేష్ కొలంబోకు వెళ్లాడని.. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుని అల్లాడుతుంటే.. లోకేష్ మ్యాచ్ చూడడం కోసం కోటి రూపాయలు ఖర్చు చేశారని ఎక్స్‌లో పోస్టు పెట్టింది వైసీపీ. కానీ ఏ ఆధారాలు లేకుండా ఈ ట్వీట్ వేశారని.. కాసేపటికే తేలిపోయింది. ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్.. అసలు విషయాన్ని వెల్లడించింది.

లోకేష్ పూర్తిగా సొంత డబ్బులతో ఈ మ్యాచ్ కోసం వెళ్లారని.. ప్రభుత్వ నిధులు ఖర్చు చేయలేదని స్పష్టం చేసింది.ఈ వ్యవహారం మీద నారా లోకేష్ సైతం తాజాగా స్పందించాడు.

‘‘ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా @ysjagan ? #PsychoFekuJagan’’ అంటూ ట్వీట్ వేశాడు లోకేష్. ‘పుష్ప’లో ‘‘ఈ కాలూ నాదే’’.. అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగును గుర్తు చేసేలా లోకేష్ ట్వీట్ వేయడంతో.. జగన్ అండ్ కోకు మాస్ రిప్లై ఇచ్చాడంటూ టీడీపీ శ్రేణులు తమ నాయకుడిని కొనియాడుతున్నారు.

కనీసం వెరిఫై చేయకుండా ఇలాంటి పోస్టు పెట్టిన సాక్షి, వైసీపీ సోషల్ మీడియా.. ఇది అబద్ధం అని క్లారిటీ ఇచ్చాక కూడా ఆ ట్వీట్‌ను డెలీట్ చేయకపోవడం గమనార్హం. వైసీపీ తీరే అంత.. ఫేక్ వార్తలు ప్రచారం చేయడం, అది నిజం కాదని తేలాక కూడా స్పందించకుండా అలాగే ఉండిపోవడం వారికి అలవాటే అంటూ టీడీపీ వాళ్లు దుయ్యబడుతున్నారు.

Related Post

Interview: Siddu Jonnalagadda – I believe my role in Telusu Kada will shock & surprise everyone
Interview: Siddu Jonnalagadda – I believe my role in Telusu Kada will shock & surprise everyone

Celebrity stylist Neerraja Kona is making her directorial debut with the romantic drama Telusu Kada, which features Siddu Jonnalagadda, Raashii Khanna, and Srinidhi Shetty. The triangular love story produced by

భాగ్య‌న‌గ‌రంలో గ‌న్ క‌ల్చ‌ర్.. డేంజ‌రే!భాగ్య‌న‌గ‌రంలో గ‌న్ క‌ల్చ‌ర్.. డేంజ‌రే!

తెలంగాణ ప్ర‌భుత్వం… పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారుస్తామ‌ని చెబుతున్న హైద‌రాబాద్‌లో గ‌న్ క‌ల్చ‌ర్ పెరుగుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వ్య‌క్తిగ‌తంగా తుపాకులు క‌లిగి ఉన్న జ‌నాభా ఉన్న‌ ద‌క్షిణాది రాష్ట్రాల్లో.. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. అయితే.. తుపాకుల వినియోగం గ‌త

మణిరత్నం ప్రేమకథలో వాళ్లిద్దరూమణిరత్నం ప్రేమకథలో వాళ్లిద్దరూ

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో మణిరత్నం ఒకరు. నాయకుడు.. ఘర్షణ.. గీతాంజలి.. రోజా.. బొంబాయి.. ఇద్దరు.. దిల్ సే.. సఖి.. యువ.. లాంటి ఎన్నో క్లాసిక్స్‌తో భారతీయ ప్రేక్షకులను ఉర్రూతలూగించారాయన. తర్వాతి కాలంలో మణిరత్నం ఫ్లాపులు ఇచ్చారు కానీ..