hyderabadupdates.com Gallery పూరీ జ‌గ‌న్నాథ్ సేతుప‌తి మూవీ టైటిల్ ఖ‌రారు

పూరీ జ‌గ‌న్నాథ్ సేతుప‌తి మూవీ టైటిల్ ఖ‌రారు

పూరీ జ‌గ‌న్నాథ్ సేతుప‌తి మూవీ టైటిల్ ఖ‌రారు post thumbnail image

హైద‌రాబాద్ : ద‌మ్మున్న ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న తాజా మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. శుక్ర‌వారం ఇందుకు గాను అధికారికంగా సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసిన‌ట్లు తెలిపారు. త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ న‌టుడిగా గుర్తింపు పొందిన విజ‌య్ సేతుప‌తి త‌న కెరీర్ లో తొలిసారిగా తెలుగు సినిమాలో హీరోగా చేస్తుండ‌డం విశేషం. స్ల‌మ్ డాగ్ అని టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు పూరీ జ‌గ‌న్నాథ్. మురికివాడల నుండి ఎవరూ ఆపలేని తుఫాను ఒకటి ఉద్భవిస్తుంది అంటూ ఓ అంద‌మైన క్యాప్ష‌న్ కూడా జోడించాడు ద‌ర్శ‌కుడు. స్వ‌త‌హాగా భావుకుడు, ర‌చ‌యిత‌గా , ద‌ర్శ‌కుడిగా, ఆలోచ‌నా ప‌రుడిగా గుర్తింపు పొందాడు.
ఇప్ప‌టికే టాప్ హీరోస్ తో ప‌ని చేసిన అనుభ‌వం ఉంది పూరీ జ‌గ‌న్నాథ్ కు. ప్ర‌త్యేకించి సినిమా టైటిళ్లు డిఫ‌రెంట్ గా ఉంటాయి. త‌న ద‌ర్శ‌క‌త్వంలో ఇప్ప‌టికే మ‌హేష్ బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ , ప్ర‌భాస్ , విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో తీశాడు. తాజాగా సేతుప‌తితో ప్లాన్ చేశాడు. ప్ర‌స్తుతం తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడైన విజ‌య్ తో జ‌త‌క‌ట్టారు. మూవీ మేకర్స్ ఒక ఆసక్తికరమైన ఫస్ట్-లుక్ పోస్టర్‌తో పాటు అధికారికంగా టైటిల్‌ను కూడా ప్ర‌క‌టించ‌డం విశేషం. విజయ్ సేతుపతి రక్తంతో తడిసిన ఆయుధాన్ని పట్టుకుని ఉన్న పోస్ట‌ర్ లుక్ అదిరేలా ఉంది. ఇప్ప‌టి దాకా చేసిన పాత్ర‌ల‌కంటే మ‌రింత భిన్న‌మైన పాత్ర‌కు ఎంపిక చేశాడు ద‌ర్శ‌కుడు.
The post పూరీ జ‌గ‌న్నాథ్ సేతుప‌తి మూవీ టైటిల్ ఖ‌రారు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Nara Lokesh: భారత్‌ లో పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారింది – మంత్రి లోకేశ్‌Minister Nara Lokesh: భారత్‌ లో పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారింది – మంత్రి లోకేశ్‌

    భారత్-ఆస్ట్రేలియా వాణిజ్యంలో ఏపీది కీలక పాత్ర అని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. భారత్‌లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా ఉందన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేశ్‌.. బ్రిస్బేన్‌ బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య

క‌రూర్ తొక్కిస‌లాట కేసులో విజ‌య్ కి సీబీఐ స‌మ‌న్లుక‌రూర్ తొక్కిస‌లాట కేసులో విజ‌య్ కి సీబీఐ స‌మ‌న్లు

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర సీమ‌లో టాప్ హీరోగా పేరు పొందిన టీవీకే పార్టీ చీఫ్ త‌ళ‌ప‌తి విజ‌య్ కి బిగ్ షాక్ త‌గిలింది. తాను చేప‌ట్టిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా త‌మిళ‌నాడులోని క‌రూర్ లో చోటు చేసుకున్న తొక్కిస‌లాట

Pakistan: 14 మందిని సిక్కులను వెనక్కి పంపేసిన పాక్Pakistan: 14 మందిని సిక్కులను వెనక్కి పంపేసిన పాక్

    సిక్కుల గురువు గురునానక్ దేవ్ 556వ జయంతి సందర్భంగా అట్టారి-వాగా సరిహద్దు వద్ద 14 మందికి పైగా యాత్రికులకు ప్రవేశాన్ని పాకిస్థాన్ నిరాకరించింది. యాత్రికుల హిందూ మత విశ్వాసాలను కారణంగా చూపుతూ పాకిస్థాన్ ఇమిగ్రేషన్ అధికారులు వారిని వెనక్కి