hyderabadupdates.com movies పెద్దిని గిల్లుతున్న ప్యారడైజ్

పెద్దిని గిల్లుతున్న ప్యారడైజ్

వచ్చే ఏడాది మార్చి చివరి వారానికి టాలీవుడ్ నుంచి రెండు పేరున్న సినిమాలు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. ముందుగా రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’ తన పుట్టిన రోజే అయిన మార్చి 27కు షెడ్యూల్ అయింది. తర్వాత నాని చిత్రం ‘ది ప్యారడైజ్’ కూడా అదే వీకెండ్‌ను రిలీజ్ కోసం ఎంచుకుంది. మార్చి 26ను విడుదల తేదీగా ప్రకటించింది. వీటిలో చరణ్ సినిమా రేంజి వేరు. ముందుగా సెట్స్ మీదికి వెళ్లింది కూడా ఆ చిత్రమే. 

దీంతో నాని సినిమా పోటీ నుంచి తప్పుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ నాని కూడా ఆ డేట్ విషయంలో పట్టుదలతోనే ఉన్నాడు. ‘ది ప్యారడైజ్’ మొదలవడానికి ముందే రిలీజ్ డేట్ క్లాష్ గురించి నాని స్పందించాడు. రిలీజ్ సమయానికి ఎవరు రేసులో ఉంటారో చూడాలని.. ఒకవేళ రెండు సినిమాలూ ఒకేసారి వచ్చినా ఇబ్బంది లేదని అన్నాడు నాని. ఐతే మధ్యలో ఈ రెండు చిత్రాలూ వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ రెండు చిత్ర బృందాలూ ఆ ప్రచారాన్ని ఖండిచాయి.

కాగా ‘పెద్ది’ సినిమా మేకర్స్ ఏదైనా ప్రోమో రిలీజ్ చేసినా.. లేదా విడుదల తేదీ గురించి అప్‌డేట్ ఇచ్చినా.. వెంటనే ‘ది ప్యారడైజ్’ టీం కూడా వెంటనే ఏదో ఒక అప్‌డేట్ ఇస్తుండడం విశేషం. కొన్ని రోజుల ముందు బుచ్చిబాబు ‘పెద్ది’ విడుదల తేదీ గురించి ఒక వేదికలో మాట్లాడాడు. అలాగే నిర్మాత ఒక నోట్ రిలీజ్ చేశాడు. వెంటనే ‘ప్యారడైజ్’ టీం దర్శకుడికి బర్త్‌డే విషెస్ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేసి తమ సినిమా కూడా అదే తేదీకి రాబోతోందని కన్ఫమ్ చేసింది. తాజాగా రామ్ చరణ్ ‘ఛాంపియన్’ వేడుకలో మార్చి 27నే తమ సినిమా వస్తుందని చెప్పాడు. వెంటనే ‘ది ప్యారడైజ్’ టీం  సినిమా నుంచి సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి విడుదల తేదీని కన్ఫమ్ చేసింది. 

పనిగట్టుకుని సంపూ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం చూస్తే ‘పెద్ది’ టీంను ‘ది ప్యారడైజ్’ బృందం గిచ్చుతున్నట్లే ఉంది. రేసులో తాము ఎంతమాత్రం వెనుకబడలేదని.. మార్చి చివరి వారం రిలీజ్ విషయంలో తాము తగ్గేదే లేదని ఎప్పటికప్పుడు నాని టీం చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఇంతకుముందు చిరు టైటిల్ ‘గ్యాంగ్ లీడర్’ను నాని వాడుకున్నపుడు అతడి మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన మెగా ఫ్యాన్స్.. ఇప్పుడు చరణ్ సినిమాకు పోటీగా తన సినిమాను వదలడానికి ప్రయత్నిస్తున్నందుకు కొంచెం గుర్రుగా ఉన్నారు. కానీ చిరు చెయ్యబోయే ఓదెల సినిమాను నిర్మించేది కూడా నానినే కావడంతో చివరి నిమిషంలో ఎవరు తగ్గుతారో చూడాలి.

Related Post

ఖర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా?ఖర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా?

ఐదేళ్ల జగన్ పాలనలో అమరావతి రాజధానిపై వైసీపీ నేతలు చిమ్మిన విషం అంతా ఇంతా కాదు. అమరావతిని శ్మశానంతో పోల్చడం మొదలు అమరావతిని అడవిలా మార్చడం వరకు వైసీపీ నేతలు చేయాల్సిందంతా చేశారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు

3 Malayalam movies to watch on OTT this week: Shades of Life to Vijayaraghavan’s Vala3 Malayalam movies to watch on OTT this week: Shades of Life to Vijayaraghavan’s Vala

Cast: Vijayaraghavan, Lukman Avaran, Dhyan Sreenivasan, Shanthi Krishna, Raveena Ravi, Sheethal Joseph, Arjun Radhakrishnan, Navas Vallikkunnu, Shafi Kollam, Gokulan Director: Muhashin Runtime: 2 hours and 11 minutes Genre: Action Comedy

రష్మికలోని అసలు నటి బయటికొచ్చిందిరష్మికలోని అసలు నటి బయటికొచ్చింది

ది గర్ల్ ఫ్రెండ్ కమర్షియల్ గాపెద్ద సక్సెస్ అవుతుందా లేదానేది పక్కన పెడితే నటన పరంగా రష్మిక మందన్న ఒకేసారి పది మెట్లు ఎక్కేసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతోంది. నిజానికి తనలో బెస్ట్ పెర్ఫార్మర్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ స్టార్ హీరోల