hyderabadupdates.com movies పెద్ది కోసం ప్రాణాలు తోడేస్తున్న బుచ్చి

పెద్ది కోసం ప్రాణాలు తోడేస్తున్న బుచ్చి

ఇప్పటిదాకా వదిలిన కంటెంట్ లో చిన్న టీజర్, పాత్రల పోస్టర్లు తప్ప అసలు పెద్దిలో ఏముందో స్పష్టంగా చెప్పే విషయాలు బయటికి రాలేదు. అంతా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్న దర్శకుడు బుచ్చిబాబు, వచ్చే ఏడాది మార్చి 27 విడుదల తేదీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నాడు. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ బోలెడు అవకాశాలు తెచ్చినా కేవలం పెద్ది కోసం సంవత్సరాల తరబడి సమయాన్ని ఖర్చు పెట్టిన బుచ్చిబాబు సినిమాని తీస్తున్న విధానం, రామ్ చరణ్ డెడికేషన్ గురించి వినిపిస్తున్న లీకులు, బయకొస్తున్న వీడియోలు అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి.

ఒక సాంగ్ షూట్ సందర్భంగా వందల అడుగుల పైనున్న ఎత్తయిన కొండప్రాంతం మీద చరణ్ ఒక చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ పాడే పాట బిట్ ఒకటుందట. ఏ మాత్రం పట్టుజారినా ఎక్కడో జారిపడిపోవడం ఖాయమనేంత రిస్క్ లో ఉంది. కానీ అదేమీ పట్టించుకోకుండా టీమ్ దాన్ని షూట్ చేసిన విధానం లైవ్ లో చూసివాళ్లకే గూస్ బంప్స్ ఇచ్చిందంటే ఇక తెరమీద చూసిన ఫ్యాన్స్ ఏమవుతారో. ఇదొక్కటే కాదు టైటిల్ సాంగ్ తీస్తున్న టైంలోనూ రెండు మూడు స్టెప్స్ పూర్తి సంతృప్తినివ్వకపోతే బుచ్చిబాబు రీటేకులు అడగటం, రామ్ చరణ్ సంతోషంగా చేసేద్దాం అని చెప్పడం యూనిట్ కి ఫుల్ జోష్ ఇస్తోందట.

ఇవే కాదు క్రికెట్ ఎపిసోడ్, ఢిల్లీ మైదానంలో వచ్చే క్లైమాక్స్ ఘట్టం, పల్లెటూరిలో చరణ్ చేసే జట్టు కూలి పనులు ఒకదాన్ని మించి మరొకటి మాస్ ఆడియన్స్ కి ఊపేయడం ఖాయమంటున్నారు. ముఖ్యంగా అంతగా ఫామ్ లో లేని ఏఆర్ రెహమాన్ తో బెస్ట్ సాంగ్స్ రాబట్టుకోవడంలో బుచ్చిబాబు వంద శాతం సక్సెస్ అయ్యాడనే మాట టీమ్ లో వినిపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ప్రమోషన్లు మొదలయ్యాక ఎలా ఉండబోతోందో. గేమ్ ఛేంజర్ గాయాన్ని పూర్తిగా మాఫీ చేస్తుందనే నమ్మకంతో ఉన్న మెగా ఫ్యాన్స్ ఆశలకు తగ్గట్టే పెద్ది షేప్ అవుతోంది. వాళ్ళ కోరిక నిజమైతే మాత్రం రంగస్థలంని మించి రికార్డులు బద్దలవ్వడం పక్కా.

Related Post

రాష్ట్రంలో ఒకేసారి 16 మంది మంత్రులు ఔట్రాష్ట్రంలో ఒకేసారి 16 మంది మంత్రులు ఔట్

​గుజరాత్ రాజకీయాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలోని ఏకంగా 16 మంది మంత్రులు ఒకే రోజు రాజీనామా చేశారు. రాబోయే 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర నాయకత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ భారీ

KGF co-director Kirtan Nadagouda’s 4-year-old son Chiranjeevi passes awayKGF co-director Kirtan Nadagouda’s 4-year-old son Chiranjeevi passes away

While further details about the project have not yet been revealed, the film stars Surya Raj, Hanu Reddy, and Preethi Pagadala in lead roles. Dinesh Divakaran will serve as the

పిక్‌టాక్‌: `త్రిమూర్తులు`… పొరుగింటి వ్య‌క్తులు ప‌క్క‌ప‌క్క‌న కూర్చున్న‌ట్టు!!పిక్‌టాక్‌: `త్రిమూర్తులు`… పొరుగింటి వ్య‌క్తులు ప‌క్క‌ప‌క్క‌న కూర్చున్న‌ట్టు!!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఏపీ సీఎం చంద్ర‌బాబు.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు.. ఒకే వేదిక‌పై ప‌లు మార్లు క‌లుసుకున్నారు. కూర్చున్నారు కూడా. కానీ.. వారంతా ప‌క్క‌ప‌క్క‌న కూర్చున్నారు. వారి మ‌ధ్య‌లో ఇత‌ర నాయ‌కులు కూడా కూర్చున్నారు. కానీ.. తాజాగా