hyderabadupdates.com movies పెద్ది సంగీతానికి రామాయణ చిక్కుముడి

పెద్ది సంగీతానికి రామాయణ చిక్కుముడి

దర్శకుడు బుచ్చిబాబు పరిస్థితి ముళ్ల మీద పరిగెత్తుతున్నట్టు ఉంది. ఆల్రెడీ పెద్ది విడుదల తేదీ మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇంకో నెల రోజులు అదనపు సమయం దొరికినా ఒత్తిడి మాత్రం అలాగే కొనసాగుతోందని యూనిట్ వర్గాల కథనం.

ప్రస్తుతం కీలక షెడ్యూల్ జరుపుకుంటున్న పెద్ది త్వరలో ఐటెం సాంగ్  షూట్ పూర్తి చేసుకోనుంది. మృణాల్ ఠాకూర్ నర్తిస్తుందనే లీక్ ఉంది కానీ నిజమా కాదానే నిర్ధారణ అఫీషియల్ గా రాలేదు. ఇదిలా ఉండగా పెద్ది మీద ఉన్న అతి పెద్ద ప్రెజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం. మరి దానికి రామాయణకు లింక్ ఏమిటనుకుంటున్నారా.  

నాలుగు వేల కోట్లతో తీయబడుతున్న ఈ బాలీవుడ్ విజువల్ గ్రాండియర్ కు సంగీతం అందిస్తున్నది ఏఆర్ రెహమానే. వచ్చే నెల పెద్ద ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. పాత్రలను పరిచయం చేయడంతో పాటు సౌండ్ అఫ్ రామాయణ పేరుతో మ్యూజిక్ లాంచ్ చేసే ప్రోగ్రాం ఒకటి డిజైన్ చేస్తున్నారట. సో దానికి సంబంధించిన పనులు రెహమాన్ చూసుకోవాల్సి ఉంటుంది.

విడుదల దీపావళికే అయినప్పటికీ ఇప్పటి నుంచే పోస్ట్ ప్రొడక్షన్ ని పరుగులు పెట్టిస్తున్నారు దర్శకుడు నితీశ్ తివారి. దీన్ని మేనేజ్ చేసుకుంటూనే పెద్దికి రెహమాన్ రీ రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయ్యింది కానీ బుచ్చిబాబు ఇంకా ఫైనల్ చెక్ చేసుకోలేదట.

అసలే రంజాన్ త్వరగా వచ్చేసింది. ఈ మాసంలో రెహమాన్ డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటారు. వృత్తికి బ్రేక్ తీసుకోరు కాని క్రియేటివ్ ప్రమోషన్లలో భాగం కావడం లాంటివి ఉండవు. కేవలం వర్క్ మాత్రమే చేయబోతున్నారు. అందుకే బుచ్చిబాబు క్రమం తప్పకుండ చెన్నై వెళ్లి వస్తూ, బీజీఎమ్ తాలూకు అప్డేట్స్ తెలుసుకుంటూ, అవుట్ ఫుట్ మీద ఆయనతో కలిసి పలు దఫాల చర్చలు చేసినట్టు సమాచారం.

క్లైమాక్స్, స్పెషల్ సాంగ్ అయ్యాక మిగిలిన భాగానికి రెహమాన్ స్కోర్ ఇవ్వాల్సి ఉంటుంది. రామాయణ లేకపోతే ఎక్కువ టైం దొరికేది కానీ ఉన్న తక్కువ సమయంలో రెహమాన్ వీటికి బెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.

Related Post

`సిట్` విచారణపై వ్యూహం రచిస్తున్న కేసీఆర్?`సిట్` విచారణపై వ్యూహం రచిస్తున్న కేసీఆర్?

ఫోన్ ట్యాపింగ్ కేసులో  రెండు సార్లు నోటీసులు అందుకున్న తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఈ ద‌ఫా కూడా.. సిట్ ముందుకు వెళ్లేందుకు స‌సేమిరా అంటున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇదే స‌మ‌యంలో సిట్ నోటీసుల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు

Will Eddie Munson Return as a Vampire in Stranger Things Season 5? Fan Theory ExplainedWill Eddie Munson Return as a Vampire in Stranger Things Season 5? Fan Theory Explained

Why fans thought Eddie Munson could return as a vampire The vampire theory gained traction because Eddie was killed by bat-like creatures, and bats are closely associated with vampires in pop