hyderabadupdates.com Gallery పెరిగిన విక్ట‌రీ వెంక‌టేష్ రెమ్యూన‌రేష‌న్

పెరిగిన విక్ట‌రీ వెంక‌టేష్ రెమ్యూన‌రేష‌న్

పెరిగిన విక్ట‌రీ వెంక‌టేష్ రెమ్యూన‌రేష‌న్ post thumbnail image

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఏజ్ పెరిగినా ఇంకా డిమాండ్ ఉన్న న‌టుల‌లో మెగాస్టార్ చిరంజీవి కాగా మ‌రొక‌రు విక్ట‌రీ వెంక‌టేశ్. ఈ ఇద్ద‌రూ క‌లిసి తాజాగా న‌టించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఊహించని రీతిలో బిగ్ స‌క్సెస్ అయ్యింది. అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ దుమ్ము రేపింది. ఏకంగా రూ. 300 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. వ‌రుస సినిమాలు విజ‌య‌వంతం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన తొమ్మిది సినిమాలు స‌క్సెస్ అయ్యాయి. ప్ర‌తి ఒక్క‌రిని ఈర్ష్య ప‌డేలా చేశాయి. వ‌రుస విజ‌యాల‌తో నిర్మాత‌లు పెద్ద ఎత్తున ద‌ర్శ‌కుడి అపాయింట్ మెంట్ కోసం క్యూ క‌డుతున్నారు.
దీంతో విక్ట‌రీ వెంక‌టేశ్ త‌న పారితోష‌కాన్ని పెంచేసిన‌ట్లు పెద్ద ఎత్తున టాక్. గ‌త కొంత కాలంగా రూ. 12 కోట్లు ప్ర‌తి సినిమాకు రెమ్యూన‌రేష‌న్ కింద తీసుకుంటున్నాడు. తాజాగా త‌న చివ‌రి రెండు మూవీస్ సంక్రాంతికి వ‌స్తున్నాం, మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ మూవీ గ్రాండ్ స‌క్సెస్ కావ‌డంతో మ‌రింత పారితోష‌కాన్ని రెట్టింపు వేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌స్తుతం త‌ను న‌టించాలంటే రూ. 22 కోట్లు ఇవ్వాలంటూ కండీష‌న్ పెడుతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా త‌న సినీ కెరీర్ లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ చేసిన మూవీగా నిలిచింది సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ. దీనికి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు అనిల్ రావిపూడి.
The post పెరిగిన విక్ట‌రీ వెంక‌టేష్ రెమ్యూన‌రేష‌న్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Azaruddin: తెలంగాణా మంత్రివర్గంలోకి అజారుద్దీన్‌Azaruddin: తెలంగాణా మంత్రివర్గంలోకి అజారుద్దీన్‌

Azaruddin : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్‌కు (Azaruddin) కలిసివచ్చింది. అనుకున్న దానికంటే ముందుగానే ఆయనను మంత్రి పదవి వరించింది. రాజ్‌భవన్‌లో శుక్రవారం ఉదయం గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అజారుద్దీన్‌తో (Azaruddin) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

జ‌గ‌న్ రెడ్డికి అభివృద్ది అంటే ప‌డ‌దు : ఎస్. స‌వితజ‌గ‌న్ రెడ్డికి అభివృద్ది అంటే ప‌డ‌దు : ఎస్. స‌విత

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న‌కు నిలువెల్లా విషం త‌ప్ప ఏమీ లేద‌న్నారు. అభివృద్ది అంటే ప‌డ‌ద‌న్నారు. ఎంత సేపు చిల్ల‌ర రాజ‌కీయాలు