hyderabadupdates.com movies పెళ్లి చేసుకున్న రాజ్ – సమంత

పెళ్లి చేసుకున్న రాజ్ – సమంత

హీరోయిన్ సమంత కొన్నేళ్ల క్రితం నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరి జీవితాన్నే గడుపుతోంది. మధ్యలో అనారోగ్యం వల్ల కొంత ఇబ్బంది పడినా, దాన్ని ధీటుగా ఎదురుకుని సిటాడెల్ లాంటి వెబ్ సిరీస్ లో నటించింది. తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో స్వంత ప్రొడక్షన్ లో మా ఇంటి బంగారం నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం జరుగుతున్న తీరు గురించి పలు సందర్భాల్లో ఫోటోలతో సాక్ష్యాలు దొరికినా తమ బంధం గురించి ఈ ఇద్దరూ ఎక్కడ బయట పడలేదు. ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో సామ్ ఫారిన్ ట్రిప్పులకు వెళ్లొచ్చిన దాఖలాలున్నాయి.

తాజాగా అందిన అప్డేట్ ప్రకారం సమంతకు పెళ్లయిపోయింది. తాను ఎంతో ఇష్టపడిన రాజ్ నిడిమోరుతోనే మూడు ముళ్ళు వేయించుకున్నట్టు సమాచారం. కోయంబత్తూర్ లో ఉన్న ఈషా యోగా సెంటర్ ప్రాంగణంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో ఈ ఇద్దరూ ఒక్కటైనట్టుగా తెలిసింది. రాజ్ మొదటి భార్య శ్యామాలి ఈ వేడుక గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వార్త వైరల్ అయిపోయింది. జంట నుంచి ఫోటోలు ఏ క్షణమైనా వచ్చేలా ఉన్నాయి. చైతు సైతం కొన్ని నెలల క్రితమే శోభితను జీవిత భాగస్వామిగా చేసుకున్న తర్వాత సామ్ కూడా అదే బాటలో నడవడం గమనార్హం.

ఏదైతేనేం సమంత ఒక ఇంటిదానిగా మారిపోవడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. కాకపోతే రాజ్ నిడిమోరు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన లీగల్ ఫార్మాలిటీస్ ఎంత మేరకు పూర్తి చేసుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఇద్దరి ఫోటోలు విదేశాలకు వెళ్ళినప్పుడు చాలా సార్లు ఆన్ లైన్ లో దర్శనమిచ్చాయి. అయితే రాజ్ తో తన బంధం గురించి సామ్ ఏనాడూ నేరుగా బయట పడలేదు. ఇప్పుడు ఒకేసారి మిసెస్ రాజ్ గా మారిపోయాక ప్రపంచానికి చెప్పినట్టు అయ్యింది. ఫ్యామిలీ మ్యాన్ తీసిన రాజ్ ఇప్పుడు సరికొత్త ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడంటూ నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.

Related Post

One Piece Season 2 Release Date Confirmed: Know Where to Watch, New Storyline and Major Cast AdditionsOne Piece Season 2 Release Date Confirmed: Know Where to Watch, New Storyline and Major Cast Additions

Netflix’s official synopsis states: “Netflix’s high-seas pirate adventure, ONE PIECE, returns for Season 2, unleashing fiercer adversaries and the most perilous quests yet. Luffy and the Straw Hats set sail