hyderabadupdates.com movies పెళ్లైన వ్యక్తితో సంబంధం.. 16 ఏళ్ల కుమార్తె పై తల్లిదండ్రుల ఘాతుకం

పెళ్లైన వ్యక్తితో సంబంధం.. 16 ఏళ్ల కుమార్తె పై తల్లిదండ్రుల ఘాతుకం

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ బాలికను ఆమె తల్లిదండ్రులే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.

ఆర్చన అనే 16 ఏళ్ల బాలిక నవంబర్ 16న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మొదట ఆమె తండ్రి రెడ్డి రాజు, తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులకు అనుమానం రావడంతో కేసును లోతుగా దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఇది ఆత్మహత్య కాదని, హత్య అని తేలింది.

పోలీసుల వివరాల ప్రకారం, ఆర్చన అదే గ్రామానికి చెందిన అనిల్ అనే పెళ్లయిన వ్యక్తితో ప్రేమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పలుమార్లు ఆమెను హెచ్చరించారు. అయినా ఆమె ఆ సంబంధాన్ని విడిచిపెట్టకపోవడంతో, కుటుంబ గౌరవానికి భంగం కలుగుతుందనే భావనతో తల్లిదండ్రులు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

నవంబర్ 15 రాత్రి ఆర్చన నిద్రపోయిన తర్వాత ఆమెకు బలవంతంగా విషం తాగించారని, ఇంకా ప్రాణాలతో ఉన్న సమయంలో తండ్రి గొంతు నులిమి చంపినట్లు విచారణలో బయటపడింది. పోలీసుల విచారణలో తండ్రి రెడ్డి రాజు నేరాన్ని ఒప్పుకున్నాడు.

ఈ ఘటన నేపథ్యంలో సైదాపూర్ పోలీసులు తల్లిదండ్రులు రెడ్డి రాజు, లావణ్యలను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు వారిని కస్టడీకి పంపింది.

ఇదిలా ఉండగా, ఆర్చన అక్క శ్రావణి మరో ఫిర్యాదు చేస్తూ, అనిల్‌తో ఉన్న సంబంధమే తన చెల్లి మృతికి కారణమని పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా అనిల్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనతో కుటుంబ గౌరవం పేరుతో జరిగే హింస ఎంత దారుణమైనదో మరోసారి గుర్తుచేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Post

భయపెడుతున్న బాహుబలి బుకింగ్స్భయపెడుతున్న బాహుబలి బుకింగ్స్

ఓవర్సీస్ లో బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్లు పూర్తయిపోయాయి. సోషల్ మీడియాలో ఆ అనుభూతి తాలూకు పోస్టులు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇండియాతో పాటు ఇతర దేశాల్లోనూ ఇవాళ రాత్రి నుంచి షోలు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని

Natural Star Nani Unveiled Gripping New Mystical Trailer Of Aadi ShambhalaNatural Star Nani Unveiled Gripping New Mystical Trailer Of Aadi Shambhala

Aadi Saikumar’s mystical thriller Shambhala: A Mystical World, directed by Ugandhar Muni and produced by Rajasekhar Annabhimoju and Mahidhar Reddy under the Shining Pictures banner, is gearing up for a