hyderabadupdates.com movies పెళ్ళికి ముందే సంబంధాలు… అవి తెలియక పెళ్ళి చేసుకొని..

పెళ్ళికి ముందే సంబంధాలు… అవి తెలియక పెళ్ళి చేసుకొని..

ఆధునిక సమాజంలో విచ్చలవిడితనం అంతకంతకూ పెరుగుతోంది. దంపతుల్లోని ఒకరి విచ్చలవిడితనం మరొకరిని తనువు చాలించేలా చేస్తోంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు… కుటుంబపరంగా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నా… ఏమాత్రం హద్దులు లేని శృంగార యావ సంసార బంధాలను తుంచేస్తోంది.

జీవిత భాగస్వామిని శాశ్వతంగా దూరం చేసుకుంటున్నారు. ఈ తరహా ఘటన హైదరాబాద్ లో ఇటీవలే వెలుగు చూసింది. మొన్నామధ్య ట్యాంక్ బండ్ లో దూకి ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వివరాలు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి.

ప్రకాశం జిల్లాకు చెందిన సీతారాం రెడ్డి… నంద్యాలకు చెందిన రేణుకను వివాహం చేసుకున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన అతడు… భార్య రేణుకతో కలిసి హైదరాబాద్ లోని బాచుపల్లికి షిఫ్ట్ అయ్యాడు. వారి దాంపత్య జీవితానికి నిదర్శనం అన్నట్టుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

అయితే రేణుక హద్దులు లేని శృంగార యావతో వివాహేతర బంధాల వైపు మళ్లింది. ఒకరు కాదు… ఇద్దరు కాదు… ఐదుకి పైగా యువకులతో ఆమె సంబంధాలు పెట్టుకుంది. ఈ క్రమంలో ఒక వ్యక్తితో రేణుక సన్నిహితంగా ఉన్న వీడియో సీతారాం కంటబడింది. అతడి గుండె పగిలినంత పనైంది.

భార్యకు సర్దిచెప్పే యత్నం చేసిన సీతారాం అందులో విఫలమయ్యాడు. రేణుక తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. వారు కూడా హైదరాబాద్ వచ్చి రేణుక మనసు మారే దిశగా యత్నించారు. అయితే అప్పటికీ రేణుక తన వైఖరిని మార్చుకోలేదట.

ఈ క్రమంలో కుటుంబంలో అంతకంతకూ అశాంతి పెరిగిన నేపథ్యంలో గత ఫిబ్రవరిలో ట్యాంక్ బండ్ వద్దక వెళ్లి అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా అతడు తన చావుకు దారి తీసిన కారణాలను వివరిస్తూ రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సీతారాం ఆత్మహత్యతో రంగంలోకి దిగిన పోలీసులు… ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను వెలికి తీశారు. రేణుకకు వివాహానికి ముందే పలువురు వ్యక్తులతో అక్రమ సంబంధాలు ఉన్నట్లుుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ విషయాలను బయటపెట్టకుండా రేణుక తల్లిదండ్రులు ఆమెను సీతారాంకు ఇచ్చి వివాహం చేశారు.

పెళ్లి చేశాక అయినా మారుతుందేమోనన్న వారి ఆశలను అడియాశలు చేసిన రేణుక తన భర్త చావుకూ కారణంగా నిలిచింది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు రేణుకతో పాట ఆమె ప్రియుల జాబితాలోని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారట. అయితే రేణుకతో పాటు ఆమెతో సంబంధం కలిగిన అందరినీ అరెస్టు చేయాలని, వారిని ఉరికంభం ఎక్కించాలని సీతారాం తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Related Post

Bhooth Bangla: No postponement, say makers — but where is the trailer?Bhooth Bangla: No postponement, say makers — but where is the trailer?

Akshay Kumar’s next release, Bhooth Bangla, is a horror-comedy directed by Priyadarshan. The film was initially announced for an April 10 release, but reports suggested a one-week postponement to avoid

ఫ్యాన్స్ సంతోషం సరే… ఇది తప్పు కదా?ఫ్యాన్స్ సంతోషం సరే… ఇది తప్పు కదా?

మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు సుష్మిత, శ్రీజ.. అబ్బాయి రామ్ చరణ్‌లకు ఇప్పటిదాకా పుట్టిన సంతానం అంతా అమ్మాయిలే. వారి మీద ఆయనకు