hyderabadupdates.com Gallery పొంగ‌ల్ ప్రపంచ పండుగ‌గా మారింది : మోదీ

పొంగ‌ల్ ప్రపంచ పండుగ‌గా మారింది : మోదీ

పొంగ‌ల్ ప్రపంచ పండుగ‌గా మారింది : మోదీ post thumbnail image

న్యూఢిల్లీ : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పొంగ‌ల్ పండుగ సంద‌ర్బంగా దేశ ప్ర‌జలంద‌రికీ పేరు పేరునా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్బంగా బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. పొంగ‌ల్ ప్ర‌పంచ పండుగ‌గా ఆవిర్భ‌వించింద‌ని అన్నారు. త‌న‌కు మ‌రింత ఆనందంగా ఉంద‌న్నారు మోదీ. ఇలాంటి పండుగలు మ‌నుషుల మ‌ధ్య మ‌రింత సంబంధాలు పెంపొందంచేలా చేస్తాయ‌ని అన్నారు. త‌మిళ‌నాడు వాసులకు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న త‌మిళుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇది తమిళ సంప్రదాయాల గొప్పదనానికి ఒక ప్రకాశవంతమైన చిహ్నమని ఆయన అన్నారు. తమిళం, ఆంగ్లంలో లేఖ రాశారు.
ప్రియమైన పౌరులారా వణక్కం అంటూ ప్రారంభించారు. పొంగల్ పండుగ శుభ సందర్భంగా మీకు , మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మానవ శ్రమకు , ప్రకృతి లయలకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని మనకు గుర్తు చేస్తుందని అన్నారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఇదిలా ఉండ‌గా ఇవాళ కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకలకు హాజరయ్యారు. పూజలు చేసి, అక్కడ సమావేశమైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా తమిళ సమాజం, సంస్కృతిని ఆరాధించే వారు పొంగల్‌ను గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారని అన్నారు. ఈ శుభ సంద‌ర్బంలో వారిలో నేను ఒకడిని అయినందుకు గర్వపడుతున్నానని అన్నారు.
The post పొంగ‌ల్ ప్రపంచ పండుగ‌గా మారింది : మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Amit Shah: చొరబాటుదారుల కారిడార్ నిర్మించడమే ప్రతిపక్షాల లక్ష్యం – అమిత్‌షాAmit Shah: చొరబాటుదారుల కారిడార్ నిర్మించడమే ప్రతిపక్షాల లక్ష్యం – అమిత్‌షా

    బిహార్‌లో ప్రధాని మోదీ పారిశ్రామిక నడవా నిర్మించాలని అనుకుంటుంటే కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు మాత్రం చొరబాటుదారుల కారిడార్‌ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాసారాం, అర్వల్‌ పట్టణాల్లో

Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలుChevireddy Bhaskar Reddy: చెవిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు

  వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి