hyderabadupdates.com movies పొలిటికల్ రూటు దాసుకి కలిసొస్తుందా

పొలిటికల్ రూటు దాసుకి కలిసొస్తుందా

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కొత్త రూటు పట్టాడు. పెద్దగా హడావిడి లేకుండా షూటింగ్ చేసుకుంటూ ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న లెగసీ టీజర్ ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా లాంచ్ చేశారు. హారర్ మూవీ పిండంతో పరిచయమైన సాయికిరణ్ రెడ్డి రెండో సినిమా ఇది.

గత ఏడాది లైలా ఇచ్చిన డిజాస్టర్ షాకుకు విశ్వక్ సేన్ బాగా డిస్టర్బ్ అయ్యాడు. బయట కనిపించడం మానేసి ఫంకీ, లెగసీలో బిజీ అయిపోయాడు. మొదటిది ఫిబ్రవరి రిలీజ్ కు రెడీ అవుతుండగా రెండోది కూడా ఈ సంవత్సరమే ఆడియన్స్ ని పలకరించనుంది. ఇక లెగసీలో మెయిన్ కాన్సెప్ట్ రెండు నిమిషాల వీడియోలో స్పష్టంగా చెప్పేశారు.

కుటుంబాన్ని సైతం రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడానికి వెనుకాడని ఒక నాయకుడు రావు రమేష్. అతను చేసే పనులకు అసహ్యం పెంచుకుని దూరంగా ఉంటాడు కొడుకు విశ్వక్ సేన్. ఒక రోజు హఠాత్తుగా తండ్రి చనిపోతాడు. దీంతో విశ్వక్ రావాల్సి వస్తుంది.

తండ్రి సమాధి మీద చేయకూడని పని చేయడానికి వెనుకాడనంత దారుణంగా ద్వేషించే విశ్వక్ పెద్దాయన వదిలిన పొలిటికల్ సామ్రాజ్యన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఫ్యామిలీలో ఉన్న కలహాలు, పదవి కోసం వెంపర్లాటలు ఇలా రోజూ యుద్ధం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మరి ఈ గేమ్ లో ఎవరెవరు ఏమేం చేశారనేది తెరమీద చూడమంటున్నారు.

మహేష్ బాబు భరత్ అనే నేను, దగ్గుబాటి రానా లీడర్ ఛాయలు లెగసీలో కనిపిస్తున్నాయ్. అయితే వీటిలో ఒకదాంట్లో తండ్రి పాత్ర మంచిదైతే మరొకదాంట్లో అవినీతిపరుడిగా చూపించారు. లెగసీలో మాత్రం పూర్తి దుర్మార్గుడిని చేశారు.

రొటీన్ కి భిన్నంగా ఏదో ట్రై చేయాలని చూస్తున్న విశ్వక్ సేన్ ఆ మధ్య గ్యాంగ్స్ అఫ్ గోదావరి, గామితో ఎక్స్ పరిమెంట్లు చేశాడు కానీ ఆశించిన స్థాయిలో పెద్ద ఫలితాలు రాలేదు. ఈసారి నేను కాదు నా సినిమా కంటెంట్లు మాట్లాడతాయని కంకణం కట్టుకున్న విశ్వక్ సేన్ మరి ఈ లెగసీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

Related Post

నాన్నమ్మ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందినాన్నమ్మ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది

ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా నటించిన జరీనా వహాబ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్టవుతున్నారు. ఇప్పటిదాకా మదర్ క్యారెక్టర్స్ లో రిపీట్ ఆర్టిస్టులను చూసి

జ‌గ‌న్‌ను స‌మ‌ర్థించేవారు.. సైలెంట్ అయ్యారేంటి?జ‌గ‌న్‌ను స‌మ‌ర్థించేవారు.. సైలెంట్ అయ్యారేంటి?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను స‌మ‌ర్థించేవారు.. ఉన్నారా?  అంటే.. ఉన్నారు. ఇటు సోష‌ల్ మీడియా వేదిక‌గా.. అటు రాజ‌కీయంగా కూడా ఆయ‌న‌ను .. ఆయ‌న విధానాలను త‌ర‌చుగా స‌మ‌ర్థించే నాయ‌కులు చాలా మందే ఉన్నారు. ఇక‌, జ‌ర్న‌లిస్టులు, సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు కూడా