చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. టీవీకే పార్టీ దళపతి విజయ్ సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఏ పార్టీతో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు. తనపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తల వంచనని ప్రకటించారు. నేను బానిసగా ఉండటానికి రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. తాను ముందు నుంచి పోరాటమే పనిగా ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. ఎవరినీ దేబరించాల్సిన పని లేదన్నారు విజయ్. ప్రజలు తనను విశ్వసిస్తే సరిపోదని అన్నారు. ఆనీ మిమ్మల్ని మీరు కూడా విశ్వసించాలని హితవు పలికారు టీవీకే చీఫ్. తాజాగా కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ తో కలిసి పోటీ చేయనున్నారని, ఈ మేరకు తనపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టాడు.
ఈ మేరకు టీవీకే విజయ్ మీడియాతో మాట్లాడారు. ఎన్ని కుట్రలకు తెర లేపినా, భయాందోళనకు గురి చేసినా , ఇక్కట్లకు గురి చేస్తున్నా సరే తాను ఒత్తిళ్లకు లొంగే రకం కాదన్నారు . ఎవరి నీడలోనో తాను బతకడానికి లేదా బానిసగా ఉండేందుకు పాలిటిక్స్ లోకి రాలేదన్నారు. ఇదిలా ఉండగా బీజేపీ జన నాయగన్ చిత్రాన్ని అడ్డుకుంటోందని, ఎన్డీయే కూటమిలో చేరమని విజయ్ పై ఒత్తిడి తెచ్చేందుకు కరూర్ తొక్కిసలాటను సాకుగా తీసుకుని సీబీఐ విచారణను వాడుకుంటోందంటూ విదుతలై చిరుతైగల్ కట్చి నాయకుడు తోల్. తిరుమావళవన్‌తో సహా డీఎంకే మిత్రపక్షాలు ఆరోపణలు చేస్తున్న సమయంలో విజయ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
The post పోరాడటమే తప్పా పొత్తులంటూ ఉండవు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
పోరాడటమే తప్పా పొత్తులంటూ ఉండవు
Categories: