hyderabadupdates.com movies ప్రకాశ్ రాజ్: “సారీ… ఇకపై ఇలాంటివి చేయను”

ప్రకాశ్ రాజ్: “సారీ… ఇకపై ఇలాంటివి చేయను”

బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ఈ రోజు సీఐడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, “మొదట అది గేమింగ్ యాప్ అనుకుని ప్రమోషన్ చేశాను. తర్వాత అది బెట్టింగ్ యాప్ అని తెలిసిన వెంటనే తప్పుకున్నాను. బెట్టింగ్ యాప్ వల్ల యువత జీవితాలు నాశనం అవుతాయి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నేను చేసినది తప్పు అని ఒప్పుకుంటున్నాను” అన్నారు.

అలాగే ఆయన పేర్కొంటూ, “2016లో నేను ఆ యాప్‌కు ప్రమోషన్ చేశాను. 2017లో ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం విధించింది. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను. అప్పటి నుంచి ఇలాంటి యాప్స్‌ను ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు. యువత కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకూడదు” అని సూచించారు.

మియాపూర్, సైబరాబాద్ ప్రాంతాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు సీఐడీకి బదిలీ అయ్యాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇదే కేసులో గత జూలై 30న ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు.

Related Post