hyderabadupdates.com Gallery ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిన‌వ ఊస‌రవెల్లి

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిన‌వ ఊస‌రవెల్లి

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిన‌వ ఊస‌రవెల్లి post thumbnail image

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె కేంద్ర స‌ర్కార్ ను, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దేశంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, కేవ‌లం స్వ‌ప్ర‌యోజ‌నాలకే పెద్ద‌పీట వేస్తున్నారంటూ ఆరోపించింది. ఇవాళ విజ‌య‌వాడ‌లో ష‌ర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లుపై రంగులు మార్చడంలో నరేంద్ర మోదీజీ అభినవ ఊసరవెల్లిగా మారి పోయాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ‌లు చేశారు. ⁠నారీ ముసుగులో డీ లిమిటేషన్ బిల్లు తెచ్చిన కపట సూత్రధారి అని ఆరోపించారు. ⁠ప్రతిపక్షాలపై ప్రధాని పెట్టేవి పెడబొబ్బలు త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. మహిళా శక్తిని అడ్డుకున్నారని బీజేపీ ముసలి కన్నీరు. కార్చ‌డం దారుణ‌మ‌న్నారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని పేర్కొన్నారు.
⁠33 శాతం రిజర్వేషన్ల అమలుకు అసలు ద్రోహి మోడీనేని వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఆరోపించారు. ⁠2023 లో ఆమోదం పొందిన బిల్లును అమలు చేయకుండా, మళ్లీ పార్లమెంట్ ముందుకు సవరణ బిల్లు తెచ్చి.. ⁠దానికి పునర్విభజనతో లింక్ పెట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ⁠ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని బీద ఏడుపులు ఎందుకు ? మహిళలను మన్నించమని అడగడం ఎందుకు ?
⁠రాజకీయ స్వలాభం కోసం విపక్షం మీద శాపనార్థాలు పెట్టడం ఎందుకు ? అని నిల‌దీశారు. ప్రధాని మోడీ కి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే, ⁠మహిళల ఆత్మ గౌరవం మీద పట్టింపు ఉంటే నారీ శ‌క్తి వంద‌న అభియాన్ 2024 చ‌ట్టాన్ని వెంట‌నే అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు.
The post ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిన‌వ ఊస‌రవెల్లి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

2028 నాటికి ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు2028 నాటికి ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు

అమరావతి : హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ పల్లెకు, ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద 2028 నాటికి

క‌లెక్ట‌ర్ హిమాన్షు శుక్లా ప‌నితీరు భేష్ : సీఎంక‌లెక్ట‌ర్ హిమాన్షు శుక్లా ప‌నితీరు భేష్ : సీఎం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న నెల్లూరు జిల్లా క‌లెక్ట‌ర్ హిమాన్షు శుక్లా ప‌నితీరుపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇదిలా ఉండ‌గా జిల్లాలో వినూత్నంగా అమలు చేస్తున్న వన్ మంత్… వన్ విలేజ్… ఫోర్

Nobel Prize: క్వాంటమ్‌ టెక్నాలజీపై పరిశోధనకు ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతిNobel Prize: క్వాంటమ్‌ టెక్నాలజీపై పరిశోధనకు ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతి

Nobel Prize : భౌతికశాస్త్రంలో అడ్వాన్స్‌డ్‌ క్వాంటమ్‌ టెక్నాలజీపై పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు… ఈ ఏడాది నోబెల్‌ బహుమతి (Nobel Prize) వరించింది. ఆ ముగ్గురూ… బ్రిటన్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త జాన్‌ క్లార్క్‌ (83), ఫ్రాన్స్‌కు చెందిన భౌతిక