hyderabadupdates.com movies ప్రభావం చూపించిన బుధవారం ప్రీమియర్లు

ప్రభావం చూపించిన బుధవారం ప్రీమియర్లు

మిత్ర మండలి మీద అపారమైన నమ్మకం చూపించిన నిర్మాత బన్నీ వాస్, రిలీజ్ కు ముందు రోజు అది కూడా బుధవారం రాత్రి ప్రీమియర్లు వద్దని చాలా మంది వారించారని ప్రెస్ మీట్ లో చెప్పిన సంగతి తెలిసిందే. రెండు మూడు షోలు వేగంగా ఫిల్లింగ్ అవుతున్నాయనే ఉద్దేశంతో ముఖ్యంగా హైదరాబాద్ షోలు విపరీతంగా పెంచేసుకుంటూ పోయారు. ఇతర ప్రాంతాల్లో కూడా సాయంత్రం ఏడు నుంచే ఆటలు మొదలుపెట్టేశారు. అయితే ఆయనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఫ్రెండ్స్ చెప్పినట్టే మిత్ర మండలి మీద సదరు స్పెషల్ షోల టాక్ ప్రభావం గట్టిగానే చూపించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో.

మొన్న అర్ధరాత్రికి మునుపే మిత్ర మండలి గురించి ట్వీట్లు రివ్యూలు సామజిక మాధ్యమాల్లో కనిపించాయి. అధిక శాతం మిక్స్డ్ తరహాలో ఉండటంతో న్యూట్రల్ ఆడియన్స్ మిగిలిన మూడు సినిమాల రిపోర్ట్స్ వచ్చాక ఏదో చూడాలో నిర్ణయించుకుందామని ఆగిపోవడంతో ఆ మేరకు బుకింగ్స్ హఠాత్తుగా నెమ్మదించేశాయి. నలుగురు కుర్రాళ్ళు, ఒక అమ్మాయి మధ్య కథను వినోదాత్మకంగా జాతిరత్నాలు తరహాలో చెప్పాలని ప్రయత్నించిన దర్శకుడు విజయేందర్ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మాములుగా మొదటి రోజే సక్సెస్ మీటంటూ కనిపించే హడావిడి మిత్ర మండలికి చేయలేదు.

సినిమా బాగున్నా బాగోకపోయినా వీక్ డేస్ లో ప్రీమియర్లు వేయడం గురించి దర్శక నిర్మాతలు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. తమ ప్రోడక్ట్ మీద అతి నమ్మకంతో రిస్క్ చేస్తే అసలుకే మోసం రావొచ్చు. అందుకే కె ర్యాంప్, తెలుసు కదా, డ్యూడ్ ఈ మూడింటిలో ఏదీ ఎర్లీ ప్రీమియర్లకు వెళ్లడం లేదు. కనీసం ఉదయం ఏడు గంటల షోలైనా వేసే సాహసం చేయలేదు. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు అందరితో పాటు ఒకేసారి బరిలో దిగాలి. కానీ ముందు వచ్చి అడ్వాంటేజ్ తీసుకుందామనే ప్రయత్నం బెడిసికొట్టే ప్రమాదం లేకపోలేదు. మరి మిత్ర మండలి దీని వల్ల ఎంత ఎఫెక్ట్ అయ్యిందో తెలిసేది వీకెండ్ తర్వాతే.

Related Post

Dave Bautista & Jack Champion in ‘Trap House’ Action Thriller Trailer
Dave Bautista & Jack Champion in ‘Trap House’ Action Thriller Trailer

“If we don’t get ’em, the cartel will, right? And they don’t forget…” Aura Entertainment has unveiled the official trailer for Trap House, an action thriller from filmmaker Michael Dowse