hyderabadupdates.com movies ప్రభాస్ కూడా కొట్టుంటేనా

ప్రభాస్ కూడా కొట్టుంటేనా

2026 బాక్సాఫీస్ సంక్రాంతి ప్రధాన ఘట్టం అయిపోయింది. మొత్తం అయిదు సినిమాల స్క్రీనింగ్లు అయిపోయాయి. టెక్నికల్ గా నారి నారి నడుమ మురారి ఈ రోజు విడుదల అయినా నిన్న ఏపీ తెలంగాణలో పెద్ద ఎత్తున ఈవెనింగ్ షోలతో రిలీజయ్యింది.

మన శంకర వరప్రసాద్ గారు మాస్ రాంపేజ్ చూపిస్తుండగా అనగనగా ఒక రాజుకు పాజిటివ్ రెస్పాన్స్ క్రమంగా పెరుగుతోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తికి బిసి సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతూ ఉండగా శర్వా మూవీకి ప్రీమియర్ పూర్తి కావడం ఆలస్యం బాగుందనే మాట సోషల్ మీడియాలో కనిపిస్తోంది. వీటన్నింటికి థియేటర్ల దగ్గర సందడి నెలకొంది.

ఎటొచ్చి ఒక్క ప్రభాస్ మాత్రమే ఈ యుద్ధంలో ఎదురీది పోరాడాల్సి వస్తోంది. రాజా సాబ్ మీద ఉన్న విపరీతమైన అంచనాలు అందుకోవడంలో దర్శకుడు మారుతీ విఫలం కావడంతో దాని ప్రభావం రిజల్ట్ మీద కనిపిస్తోంది. ప్రమోషన్ల విషయంలో టీమ్ ఏ లోటు చేయలేదు కానీ కంటెంట్ పరంగా జరిగిన పొరపాట్లు పెద్ద మూల్యాన్ని చెల్లించేలా చేశాయి.

ఎడిటింగ్ తప్పిదాలతో పాటు పెద్ద ప్రభాస్ ఫైట్ ని మూడు రోజుల తర్వాత కలపడం లాంటి అంశాలు పాజిటివిటీ కంటే నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువ వచ్చేలా చేశాయి. అయినా సరే ప్రభాస్ ఇమేజ్ రెండు వందల కోట్ల గ్రాస్ దాటించింది. లేదంటే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండేది.

ఒక సంక్రాంతికి ఒకేసారి నాలుగు సినిమాలకు రేటింగ్స్, రివ్యూలు బాగా రావడం గత కొన్నేళ్లలో ఇదే మొదటిసారని చెప్పొచ్చు. గతంలో ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి టైంలో ఈ తరహా స్పందన చూశాం కానీ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ ఫీట్ సాధించడం అరుదైన ఘనత.

ఆదివారం దాకా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇదే పరిస్థితి కొనసాగనుంది. సెలవులు సోమవారం ముగుస్తాయి. అక్కడి నుంచి ఎవరు స్ట్రాంగ్ గా ఉంటారనేది కీలకం కానుంది. మొదటి స్థానం యునానిమస్ గా మన శంకరవరప్రసాద్ గారుదే కానీ మిగిలిన సెకండ్, థర్డ్ ర్యాంకులు ఎవరికి దక్కుతాయనేది ఇంకొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.

Related Post

Chiranjeevi’s Next Promises Double Entertainment, Says Anil RavipudiChiranjeevi’s Next Promises Double Entertainment, Says Anil Ravipudi

Anil Ravipudi shared exciting updates about Mana Shankara Vara Prasad (MSG), calling it Chiranjeevi’s first full-fledged family entertainer in nearly 20 years. Speaking at IFFI 2025, the director said the

Nidhhi Agerwal Credits Prabhas for India’s Big-Budget Film EraNidhhi Agerwal Credits Prabhas for India’s Big-Budget Film Era

Actor Nidhhi Agerwal has spoken with heartfelt admiration about Prabhas, crediting him for transforming the scale and ambition of Indian cinema. In a recent interaction, Nidhhi said she strongly believes