హైదరాబాద్ : పీపుల్స్ మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ప్రభాస్ , మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమారి కీ రోల్ పోషించిన చిత్రం రాజా సాబ్. సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదలైంది. ఆశించిన మేర వర్కవుట్ కాలేదు. అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆపై దర్శకుడు మారుతిపై తీవ్ర విమర్శలు నెలకొన్నాయి. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా ఇదే ఫెస్టివల్ సందర్బంగా పలు సినిమాలు ముందుకు వచ్చాయి. నవీన్ పోలిశెట్టి, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషించిన అనగనగా ఒక రోజు, ప్రభాస్ నటించిన రాజా సాబ్, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నయనతార , టీటీకే గణేష్ కీ రోల్స్ పోషించిన మన శంకర వర ప్రసాద్ గారు, మాస్ మహారాజా రవితేజ, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ నటించిన భర్త మహాశయులకు విజ్ఙప్తి రిలీజ్ అయ్యాయి.
పలు సినిమాలు విడుదలైనా చివరకు టాప్ లో కొనసాగుతోంది మన శంకర వర ప్రసాద్ గారు, అనగనగా ఒక రోజు మాత్రమే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతున్నాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ, వినోదం ప్రధానంగా సాగిన సినిమాలకే జనం జై కొట్టారు. ఈ తరుణంలో ప్రభాస్ రాజ్ నటించిన మూవీ ఆశించిన మేర ఆడక పోవడంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్ట పోయారు. పెట్టిన డబ్బులు రాక పోవడంతో వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ మేరకు దాదాపు 50 శాతానికి పైగా తాము నష్ట పోయామని, వెంటనే తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు.
The post ప్రభాస్ రాజా సాబ్ ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూటర్లకు లాస్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ప్రభాస్ రాజా సాబ్ ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూటర్లకు లాస్
Categories: