మంగళగిరి : దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. శుక్రవారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన 11వ శిక్షణ తరగతుల్లో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ క్యాడర్ సమన్వయంతో పాటు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా ఓర్పుతో, ఐక్యంగా దుష్ప్రచారాలను ఎదుర్కోవాలని సూచించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు.
2014–19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినా, వాటిని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లడంలో వెనుక బడ్డామని లోకేష్ గుర్తు చేశారు. అదే అప్పటి ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి కార్యక్రమాన్ని ప్రజలకు నేరుగా వివరించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని స్పష్టం చేశారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్లతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. 2019లో అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టామని, కానీ ప్రతిపక్షం దుష్ప్రచార రాజకీయాలతో అధికారంలోకి వచ్చిందని లోకేష్ అన్నారు. ఇకపై అభివృద్ధితో పాటు, తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేసే శక్తులను ధీటుగా ఎదుర్కోవాలని పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం చేశారు.
The post ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి : నారా లోకేష్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి : నారా లోకేష్
Categories: