hyderabadupdates.com movies ‘ఫంకీ’తో లాభపడ్డ ఒకే వ్యక్తి

‘ఫంకీ’తో లాభపడ్డ ఒకే వ్యక్తి

వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్‌ను హీరీగా పెట్టి ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ కేవీ రూపొందించిన చిత్రమిది. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్నిప్రొడ్యూస్ చేశాడు.

కానీ ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. రివ్యూలు మరీ దారుణంగా వచ్చాయి. టాక్ కూడా ఏమంత బాగా లేదు. వీకెండ్లోనే నిలబడలేకపోయిన ‘ఫంకీ’.. సోమవారం నుండి క్రాష్ అయిపోయింది. మినిమం ఆక్యుపెన్సీలు కరవైన పరిస్థితి.

ఈ మూవీ అత్యధికంగా డ్యామేజ్ చేసింది దర్శకుడు అనుదీప్‌కే. ‘జాతిరత్నాలు’ తర్వాత ‘ప్రిన్స్’తో అంచనాలను అందుకోలేకపోయిన అనుదీప్.. ‘ఫంకీ’తో పుంజుకుంటాడనుకున్నారు. కానీ ‘ప్రిన్స్’ మూవీనే నయం అనే టాక్ వచ్చింది.

అనుదీప్ ఒక జోన్లో ఉండిపోయాడని.. దాన్ని మించి సినిమాలు తీయలేడనే అభిప్రాయం బలపడిపోయింది. ఇక్కడి నుంచి కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడం సవాలే. ఇక ఆల్రెడీ హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదుర్కొన్న విశ్వక్ సేన్ కు కూడా ‘ఫంకీ’ రిజల్ట్ పెద్ద ఎదురుదెబ్బే. కొంత కాలంగా సక్సెస్ రేట్ బాగా పడిపోయి ఇబ్బందిపడుతున్న నాగవంశీకి కూడా ఇది షాకే. ‘అనగనగా ఒక రోజు’ విజయానందాన్ని ‘ఫంకీ’ ఆవిరి చేసింది.

ఐతే మిగతా అందరికీ మైనస్సే అయినా.. హీరోయిన్ కాయదు లోహర్‌కు మాత్రం ‘ఫంకీ’ ప్లస్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. సినిమా ఆడకపోయినా.. ‘ఫంకీ’తో జనాల దృష్టిలో పడింది. సినిమాకు ఆమె అందం, అభినయం ఆకర్షణగా నిలిచాయి. ప్రతి సన్నివేశంలోనూ హుషారుగా కనిపిస్తూ, నటిస్తూ ఆమె ఆకట్టుకుంది.

కుర్రాళ్లకు ఆమె తెగ నచ్చేసింది. చీర్‌ఫుల్‌గా ఉండే తన లుక్స్ కట్టిపడేశాయి. నటన కూడా బాగానే సాగడంతో కాయదుకు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అవకాశాలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆల్రెడీ ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయని.. త్వరలోనే కాయదు కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్లు రావచ్చని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Related Post

నిర్మాత మాట… 1 నేనొక్క‌డినే ఇప్పుడొచ్చినా…నిర్మాత మాట… 1 నేనొక్క‌డినే ఇప్పుడొచ్చినా…

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్‌ల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన 1 నేనొక్క‌డినే సినిమాపై విడుద‌ల‌కు ముందు అంచ‌నాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ఇద్ద‌రూ క‌లిసి ఇండ‌స్ట్రీ హిట్‌ను డెలివర్ చేస్తార‌ని అభిమానులు ఆశించారు. కానీ తెలుగు

Family audiences are enjoying every moment in BMW – Sudhakar CherukuriFamily audiences are enjoying every moment in BMW – Sudhakar Cherukuri

Ravi Teja, Ashika Ranganath, Dimple Hayathi starrer Bhartha Mahasayulaku Wignyapthi released yesterday to a highly positive response. The movie is produced by Sudhakar Cherukuri and directed by Kishore Tirumala. The