hyderabadupdates.com movies ఫాంటసీ ప్రపంచంలో టాలీవుడ్ హీరోలు

ఫాంటసీ ప్రపంచంలో టాలీవుడ్ హీరోలు

ఒకప్పుడు ఫాంటసీ బ్యాక్ డ్రాప్ సినిమాలు అరుదుగా వచ్చేవి. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి మధ్య ఎందుకు అంత గ్యాప్ వచ్చిందంటే కారణం బడ్జెట్టే. ఆదిత్య 369 తర్వాత బాలయ్య మళ్ళీ ఆ స్థాయి ప్రయోగం చేయలేదు. ఇప్పటి తరంలో ప్రధానంగా ఈ మధ్యలో ఈ జానర్ ను టచ్ చేస్తున్న హీరోల సంఖ్య బాగా పెరుగుతోంది. నాగ చైతన్య ‘వృషకర్మ’ విజువల్స్ చూశాక ఇండస్ట్రీలో దాని గురించే మాట్లాడుకుంటున్నారు. చైతు సేఫ్ గేమ్ వదిలేసి తండేల్ లో నటనను మెరుగుపరుచుకుని ఇప్పుడు లార్జర్ తాన్ లైఫ్ పాత్రను ఎంచుకోవడం మంచి విషయమే.

నిఖిల్ గతంలో కార్తికేయ 2 చేసినప్పటికీ దానికి మించిన విజువల్ గ్రాండియర్ ‘స్వయంభు’లో చూపించబోతున్నాడు. టీజర్ కు ఇప్పటికే భారీ రెస్పాన్స్ రాగా కంటెంట్ మీద ఓ రేంజ్ నమ్మకం పెట్టుకున్నాడు. డెబ్యూ డిజాస్టర్ అయినప్పటికీ హీరో విరాట్ కర్ణ మీద దర్శక నిర్మాత అభిషేక్ నామా పెడుతున్న బడ్జెట్ చూస్తే కళ్ళు తిరగక మానవు. ఇప్పటికే ‘నాగబంధం’ గురించి బిజినెస్ ఎంక్వయిరీలు మొదలయ్యాయట. చిరంజీవి ‘విశ్వంభర’ సైతం క్వాలిటీ కోసం పోరాడుతూ కేవలం విజువల్ ఎఫెక్ట్స్ మీద సంవత్సరం పైగానే ఖర్చు పెట్టింది. అవుట్ ఫుట్ బెస్ట్ అనిపించే వరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయరని వినికిడి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఏఏ 22’ విజువల్ గ్రాండియర్ గురించి వస్తున్న లీకులు మాములు ఎగ్జైట్ మెంట్ కలిగించడం లేదు. ఇటీవలే ప్రారంభమైన ‘కల్కి 2’లో మొదటి భాగాన్ని మించిన స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అవి అబ్బుర పరుస్తాయని ఆల్రెడీ లీక్ ఉంది. ఇక రాజమౌళి – మహేష్ బాబు కలయికలో రూపొందుతున్న ‘వారణాసి’ మీద ఏకంగా జేమ్స్ క్యామరూన్ లాంటి వరల్డ్ ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే ఊహకందని  అద్భుతమని చెప్పాలి.  

రిషబ్ శెట్టితో దర్శకుడు ప్రశాంత్ వర్మ తీస్తున్న జై హనుమాన్, ఆదర్శ కుటుంబం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేసుకున్న గాడ్ అఫ్ వార్ కూడా ఇదే కోవలోకి వస్తాయి. ప్రతిపాదన స్టేజిలో ఉన్నవి, ప్రొడక్షన్ కు వెళ్లాల్సినవి కన్ఫర్మ్ అయితే ఈ లిస్టు మరింత పెరుగుతుంది. ఇక్కడ చెప్పిన వాటిని రఫ్ గా లెక్కేసుకున్నా సులభంగా నాలుగైదు వేల కోట్లు అవుతాయి.

థియేటర్, నాన్ థియేటర్ బిజినెస్ దాదాపు రెట్టింపు మోతాదులో అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో బాలీవుడ్, కోలీవుడ్ ఎక్కడా ఇన్ని ఫాంటసీ సినిమాలు తెరకెక్కడం లేదన్నది వాస్తవం. ఇవన్నీ హిట్ అయితే టాలీవుడ్ స్థాయి ఎక్కడికి వెళ్తుందో ఊహించుకోవడం కష్టమే.

Related Post

మంచి సినిమాను చూడ‌రా… ఫ్యాన్స్ ఆక్రోశంమంచి సినిమాను చూడ‌రా… ఫ్యాన్స్ ఆక్రోశం

కొన్ని సినిమాలకు రివ్యూలు, టాక్ అటు ఇటుగా ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర కొన్ని విషయాలు కలిసొచ్చి బాగా ఆడేస్తుంటాయి. స్థాయికి మించి విజయాన్ని అందుకుంటూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలకు మాత్రం టాక్ చాలా బాగున్నా, రివ్యూలూ పాజిటివ్‌గా వచ్చినా.. అనుకున్నంతగా ఆడవు. ఆ

ఇకపై డీప్ ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తే…ఇకపై డీప్ ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తే…

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)…ప్రధాని మోదీ మొదలు ప్రముఖ నటి రష్మిక మందన్న వరకు ఏఐ బాధితులే. కృత్రిమ మేథస్సుతో ఉపయోగాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయని చెప్పే ఘటనలు కోకొల్లలు. ఇక, కొందరు పొలిటియన్లయితే తమపై వచ్చిన లైంగిక ఆరోపణలనుంచి తప్పించుకునేందుకు డీప్