hyderabadupdates.com movies ఫాక్ట్ చెక్… ఆలయ గోపురం ఎక్కి అతనేం చేశాడు?

ఫాక్ట్ చెక్… ఆలయ గోపురం ఎక్కి అతనేం చేశాడు?

తిరుమల–తిరుపతికి సంబంధించిన తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయని టీటీడీ తెలిపింది. ఇలాంటి వార్తలను నమ్మకుండా, అధికారిక టీటీడీ ప్రకటనలనే విశ్వసించాలని భక్తులకు సూచించింది. నిన్న రాత్రి ఒక వ్యక్తి లోనికి ప్రవేశించారు. ఉన్నట్లుండి అతను అక్కడ ఉన్న టెంట్ కొయ్యల ద్వారా నడిమి గోపురం పైకి ఎక్కడం జరిగింది. దీనిపై టీటీడీ వివరణ ఇచ్చింది.

నిన్న రాత్రి నిజామాబాద్‌కు చెందిన కూర్మవాడ పెద్దమల్లారెడ్డి కాలనీకి చెందిన తిరుపతి అనే వ్యక్తి ఇతర భక్తుల మాదిరిగానే తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలోకి వెళ్లాడు. కొద్దిసేపటికి అతడు అకస్మాత్తుగా ఆలయంలో ఉన్న టెంట్‌ కొయ్యల మీదుగా నడుచుకుంటూ గోపురం పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన విజిలెన్స్ సిబ్బంది వెంటనే పోలీస్‌, ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

పోలీసులు, ఫైర్‌ సిబ్బంది దాదాపు మూడు గంటల పాటు శ్రమించి అతడిని గోపురం పై నుంచి కిందికి దించారు. అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గోపురంపై ఉన్న కలశాలను అతడు పగలగొట్టాడన్న ప్రచారం పూర్తిగా అసత్యమని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఇలాంటి వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారం ప్రకారమే స్పందించాలని కోరింది.

Related Post

స్థానికంపై త‌ర్జ‌న – భ‌ర్జ‌న‌.. నిధుల కోస‌మైనా ..!స్థానికంపై త‌ర్జ‌న – భ‌ర్జ‌న‌.. నిధుల కోస‌మైనా ..!

స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వంలో ఇబ్బందికర అంశంగా మారింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి స్థానిక సంస్థలు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయాలి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటు పంపించాలి. దానిని కేంద్ర ప్రభుత్వానికి

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణా రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. సచివాలయంలో మంత్రులు,