hyderabadupdates.com Gallery ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలో ఏపీ టాప్

ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలో ఏపీ టాప్

ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలో ఏపీ టాప్ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. దేశంలోనే అంధ్ర ప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలోనే రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉందని ప్ర‌క‌టించారు మంత్రి అచ్చెన్నాయుడు, దీనిద్వారా భూ యజమానులకే కాకుండా, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఒక గుర్తింపు సంఖ్యను ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. తద్వారా ప్రతి రైతు తన భూవిస్తీర్ణం , పండించే పంటలు నమోదు చేయబడతాయని తెలిపారు. ఇప్పటి వరకు 48.15 లక్షల రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్యలు ఇచ్చామ‌ని తెలిపారు. ఖరీఫ్ 2025లో గరిష్టంగా 118 లక్షల ఎకరాలు, 198 లక్షల భూభాగాలలో పంట బుకింగ్ నిర్వహించబడగా, సుమారు 53 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నార‌ని వెల్ల‌డించారు. ఈ ఏడాది ఫ్రిబ్ర‌వ‌రి 23 తేదీ నాటికి వ్యవసాయం, ఉద్యానవనం, పట్టు పరిశ్రమ , సామాజిక అటవీ భూమలలో వివిద పంటల క్రింద మొత్తం 67.50 లక్షల ఎకరాలు బుక్ చేయబడ్డాయని తెలిపారు అచ్చెన్నాయుడు.
ఆంధ్రప్రదేశ్ చీడపీడల పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా అన్ని పంటలలో, చీడపీడల డిజిటల్ డేటాను సేకరించి సరైన సమయంలో సరైన సూచనలు ఇవ్వటం ద్వారా పంట నష్టాన్ని తగ్గిస్తున్నామని చెప్పారు. డీప్ టెక్ టెక్నాలజీ, AI టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్ మొదలగు టెక్నాలజీలను సమర్ధవంతంగా వాడుకొని, రియల్ టైంలో ఖచ్చితమైన వ్యవసాయ సమాచారాన్ని రైతులకు SMS ద్వారా నేరుగా అందిస్తున్నామని పేర్కొన్నారు. దిగుబడుల అంచనా, పంటల భీమా క్లైములకు కూడా ఈ టెక్నాలజీని అనుసంధానిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు అచ్చెన్నాయుడు. వరి పంట దిగుబడిని శాస్త్రీయంగా అంచనా వేయడానికి ఉపగ్రహ సాంకేతిక సాయంతో YES టెక్ విధానాన్ని రాష్ట్రం లోని 10 జిల్లాలలో అమలు చేస్తున్నామని తెలిపారు. రైతు యాప్ ద్వారా అన్ని ముఖ్యమైన వ్యవసాయ సంబంధత సమాచారం , సేవలను ఒక వేదికలో నేరుగా మొబైల్ ఫోన్లలో అందిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు అచ్చెన్నాయుడు.
The post ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలో ఏపీ టాప్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీబీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ

ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తాజాగా మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) ఎన్నిక‌ల్లో ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు. శుక్ర‌వారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈసీపై

Minister Konda Surekha : బీఆర్ఎస్‌ సోషల్ మీడియాపై మంత్రి కొండా సురేఖ ఫైర్Minister Konda Surekha : బీఆర్ఎస్‌ సోషల్ మీడియాపై మంత్రి కొండా సురేఖ ఫైర్

Konda Surekha : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ (BRS) శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి

KTR: కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్KTR: కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

    స్థానిక సంస్థల ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, విపక్షాలు కసరత్తు ప్రారంభించాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అధికార కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉంది.