hyderabadupdates.com movies ఫ్యాన్స్ ఆవేదన అర్థం చేసుకోండి రాజా సాబ్

ఫ్యాన్స్ ఆవేదన అర్థం చేసుకోండి రాజా సాబ్

ది రాజా సాబ్ అప్డేట్స్ విషయంలో జరుగుతున్న ఆలస్యం ఫ్యాన్స్ అసహనానికి కారణమవుతూనే ఉంది. రేపు జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోవడం ఆందోళనని మరింత పెంచుతోంది.

ముందు ఎల్బి స్టేడియం అన్నారు. కానీ అనుమతి దొరక్కపోవడంతో రామోజీ ఫిలిం సిటీ అనుకున్నారు. కానీ ఇప్పుడు కూకట్ పల్లిలోని కైతలాపూర్ మైదానంలో జరిపేందుకు పర్మిషన్ లెటర్ పెట్టారని సమాచారం. అయితే అప్రూవల్ వచ్చిందో లేదో తెలియాల్సి ఉంది. అయితే వేడుక గురించి సరైన ఇన్ఫో లేకపోవడంతో ఫ్యాన్స్ ఎక్కడికి రావాలో అర్థం కాక వెయిట్ చేస్తున్నారు.

జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కు కేవలం 13 రోజులు మాత్రమే టైం ఉంది. రెండు టీజర్లు, రెండు పాటలు వచ్చేశాయి. స్పందన బాగుంది కానీ ఎక్స్ ట్రాడినరి కాదు. థియేటర్ కోసం కొత్త ట్రైలర్ కట్ చేసి పెట్టారు. దర్శకుడు మారుతీ బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను చివరి దశకు తెచ్చారు.

సెన్సార్ అయ్యిందనే న్యూస్ వచ్చినా దానికీ అధికారిక ముద్ర లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడూ తమకే ఇలా జరుగుతుందని తెగ ఫీలైపోతున్నారు. సలార్, కల్కి 2898 ఏడి టైంలోనూ ఇలాంటి వాయిదాలు చూడాల్సి వచ్చింది. ఇప్పుడు రాజా సాబ్ కు రిపీట్ కావడం ఎంతైనా వాళ్ళను ఆవేదనకు గురి చేసే విషయమే.

గెస్టులు ప్రత్యేకంగా ఎవరూ రాకపోవచ్చు కానీ ప్రభాసే మెయిన్ అట్రాక్షన్ కాబోతున్నాడు. స్పిరిట్ కోసం ప్రత్యేక మేకోవర్ చేసుకున్న డార్లింగ్ అదే లుక్ లో దర్శనం ఇస్తాడా లేదానేది ఆసక్తికరంగా మారింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వీలైనంత త్వరగా పబ్లిసిటీ వేగాన్ని పెంచాలనే డిమాండ్ కు అనుగుణంగా కొత్త స్ట్రాటజీలు పాటించాల్సి ఉంటుంది.

కాంపిటీషన్ లో ఉన్న మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి, జన నాయకుడు, పరాశక్తి దేనికవే కంటెంట్ ని నమ్ముకుని పోటాపోటీగా వస్తుండటంతో రాజా సాబ్ ప్రయాణం అంత తేలిగ్గా ఉండబోవడం లేదు.

Related Post

సంచ‌ల‌న వీడియో: జ‌న‌సేన‌ను కుదిపేస్తోందా?సంచ‌ల‌న వీడియో: జ‌న‌సేన‌ను కుదిపేస్తోందా?

జ‌న‌సేన‌-టీడీపీ పొత్తుపై కీల‌క సంచ‌ల‌న వ్య‌వ‌హారం.. ప్ర‌భావం చూపించ‌నుందా? టీడీపీకి చెందిన యువ నాయ‌కుడు తొలి సారి విజ‌యం ద‌క్కించుకున్న బొజ్జ‌ల సుదీర్ రెడ్డి వ్య‌వ‌హారం.. మంట పెడుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. దీనికి తోడు వ‌రుసగా జ‌రుగుతున్న ప‌రిణామాలు

అది సాధిస్తే 100 కోట్ల ప్రైజ్ మనీఅది సాధిస్తే 100 కోట్ల ప్రైజ్ మనీ

అక్షరాలా వంద కోట్లు.. అంటే వెయ్యి మిలియన్లు.. ఈ మొత్తాన్ని ఒకరికి ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం.. క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా