hyderabadupdates.com movies బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయడంతో దాన్ని అక్కడి సెలబ్రెటీలు కూడా బాగా సపోర్ట్ చేశారు. అదొక అద్భుతం అంటూ కొనియాడారు. కానీ ఆ చిత్రమే ఇండియన్ సినిమాలో బాలీవుడ్ ప్రాధాన్యాన్ని తగ్గించేసింది. సౌత్ చిత్రాల హవా పెరిగిపోయి బాలీవుడ్ ఆధిపత్యానికి బ్రేక్ పడింది. 

దీంతో తర్వాత సౌత్ సినిమాలను సపోర్ట్ చేయడం తగ్గించేశారు బాలీవుడ్ సెలబ్రెటీలు. ‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగణ్, ఆలియా భట్ నటించినా.. ఇండస్ట్రీ సైలెంటుగానే ఉంది. ‘కేజీఎఫ్-2’, ‘పుష్ప-2’ చిత్రాలు నార్త్ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసినా సౌండ్ లేదు. ఈ సినిమాలన్నింటినీ చూసి అక్కడి వాళ్లు అసూయ పడ్డ సంకేతాలు కనిపించాయి. ఇలాంటి టైంలో అల్లు అర్జున్ కొత్త సినిమాకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అండగా నిలవబోతుండడం విశేషం.

తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ చేస్తున్న పాన్ ఇండియా మూవీ ఫస్ట్ గ్లింప్స్ ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ పుట్టిన రోజు కానుకగా విడుదల కాబోతోంది. ముందు రోజు అర్ధరాత్రి 11.59 నిమిషాలకు ఈ గ్లింప్స్‌ను లాంచ్ చేయబోతున్నారట. ముంబయిలో షారుఖ్ ఖాన్ చేతుల మీదుగా గ్లింప్స్ లాంచ్ కానుండగా.. వర్చువల్‌గా బన్నీ, అట్లీ అండ్ టీం ఈ కార్యక్రమంలో పాల్గొంటుందని సమాచారం.

ఈ గ్లింప్స్‌ను షారుఖ్ లాంచ్ చేయడానికి బలమైన కారణమే ఉంది. ‘జవాన్’ రూపంలో అట్లీ.. షారుఖ్‌కు భారీ విజయాన్ని అందించాడు. అతడితో షారుఖ్ మరో సినిమా కూడా చేయాలనుకుంటున్నాడు.  ఈ నేపథ్యంలోనే బన్నీతో అట్లీ సినిమాకు సాయం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారంగానే చూడాలి. త్వరలో ఏమైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

బన్నీ, అట్లీ ఇద్దరూ సౌత్ వాళ్లే. కానీ నార్త్‌లో ఫాలోయింగ్ ఉంది. అయినా సరే.. షారుఖ్ చేతుల మీదుగా గ్లింప్స్ రిలీజైతే వచ్చే హైప్ వేరుగా ఉంటుంది. ఇక ఈ గ్లింప్స్ ఒక రేంజిలో ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తోంది. మృణాల్ ఠాకూర్, జాన్వి కపూర్, రష్మిక మందన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related Post

Bigg Boss 9 Telugu: Divya and Thanuja get into a massive fightBigg Boss 9 Telugu: Divya and Thanuja get into a massive fight

Bigg Boss 9 Telugu witnessed high-voltage drama when friends-turned-rivals Thanuja and Divya got into a heated altercation during a task. What started as a small disagreement quickly escalated, shocking both

శృతి లాగే శ్రీలీల.. పవన్ హిట్ ఇస్తాడా?శృతి లాగే శ్రీలీల.. పవన్ హిట్ ఇస్తాడా?

​టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ‘ధమాకా’ సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీకి ఆ తర్వాత అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. రీసెంట్ గా రవితేజతో చేసిన ‘మాస్ జాతర’

Sampradayini Suppini Suddapoosani: Here’s how Anil Ravipudi changed the film’s fateSampradayini Suppini Suddapoosani: Here’s how Anil Ravipudi changed the film’s fate

ETV Original film Sampradayini Suppini Suddapoosani was supposed to premiere on OTT directly, but at the last minute, the makers decided to release the crime comedy in theatres. Sivaji and