hyderabadupdates.com movies బన్నీ రికార్డు చిరు సొంతం

బన్నీ రికార్డు చిరు సొంతం

ఒకప్పుడు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నంబర్ వన్ హీరో. సినిమాల బడ్జెట్, బిజినెస్, కలెక్షన్లు, పారితోషకాలు.. ఇలా ఏది చూసుకున్నా చిరు తరచుగా రికార్డులు కొల్లగొట్టేవారు. వేరే స్టార్ల హిట్ సినిమాలకు సమానంగా చిరు ఫ్లాప్ చిత్రాల వసూళ్లు ఉండేవి. ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే కొత్త రికార్డులు నమోదు కావాల్సిందే అన్నట్లుండేది.

కానీ చిరు మధ్యలో పదేళ్ల బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేసరికి వేరే స్టార్లు చాలామంది ఆయన్ని దాటి ముందుకు వెళ్లిపోయారు. వాళ్ల మార్కెట్ చాలా పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. అయినా సరే రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’తో భారీ విజయాన్నందుకుని తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు మెగాస్టార్.

కానీ ఆ తర్వాత మాత్రం చిరు కెరీర్ ఆశించినట్లుగా ముందుకు సాగలేదు. దీంతో ఈ తరం ప్రేక్షకుల్లో చాలామంది చిరు గురించి తేలిగ్గా మాట్లాడ్డం మొదలుపెట్టారు. ఆచార్య, భోళా శంకర్ లాంటి సినిమాల ఫలితాలు యాంటీ ఫ్యాన్స్‌కు పెద్ద ఆయుధాలను ఇచ్చాయి.

కానీ చిరు అసలు బాక్సాఫీస్ స్టామినా ఏంటో ‘మన శంకర వరప్రసాద్ గారు’ రుజువు చేస్తోంది. అనిల్ రావిపూడి లాంటి ఫ్యామిలీస్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు తోడవడంతో చిరు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తున్నారు. ఆరంభం నుంచి ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తూ దూసుకెళ్తోంది.

రిలీజైన నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా మూవీ నెలకొల్పిన రికార్డును చిరు చిత్రం బద్దలు కొట్టడం విశేషం. తాజాగా మరో ఘనతను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఏడో రోజు ఏపీ, తెలంగాణల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురములో’ నెలకొల్పిన రికార్డును ‘మన శంకర వరప్రసాద్ అధిగమించింది.

బన్నీ మూవీ ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.8.6 కోట్లు కొల్లగొడితే.. చిరు చిత్రం రూ.9.5 కోట్ల దాకా కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓవరాల్ వసూళ్లు రూ.300 కోట్లకు చేరువగా ఉన్నాయి.

Related Post

Chiranjeevi’s “Meesala Pilla” Song from Mana Shankara Vara Prasad Garu Creates BuzzChiranjeevi’s “Meesala Pilla” Song from Mana Shankara Vara Prasad Garu Creates Buzz

The first single Meesala Pilla from Megastar Chiranjeevi’s upcoming family entertainer Mana Shankara Vara Prasad Garu is out now and already trending everywhere. The promo had created massive excitement, and

‘దాదా’ మృతిపై ‘దీదీ’ కీలక వ్యాఖ్యలు‘దాదా’ మృతిపై ‘దీదీ’ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వార్తతో మహారాష్ట్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అజిత్ దాదా మరణ వార్త విని ఆయన అనుచరులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అజిత్ పవార్ మృతి పట్ల ప్రధాని మోదీతో