hyderabadupdates.com Gallery బ‌రా బ‌ర్ కేసీఆర్ తెలంగాణ జాతిపిత : కేటీఆర్

బ‌రా బ‌ర్ కేసీఆర్ తెలంగాణ జాతిపిత : కేటీఆర్

బ‌రా బ‌ర్ కేసీఆర్ తెలంగాణ జాతిపిత : కేటీఆర్ post thumbnail image

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ వ‌చ్చిందే కేసీఆర్ వ‌ల్ల‌నేన‌ని అన్నారు. దానిని ఎవ‌రూ కాద‌న‌లేర‌ని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన రోజు ఇవాళ‌. ఈ సంద‌ర్బంగా మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ సార‌థ్యంలో తెలంగాణ భ‌వ‌న్ లో భారీ కేక్ ను క‌ట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రులు హ‌రీశ్ రావు, కేటీఆర్, వి. శ్రీ‌నివాస్ గౌడ్, ల‌క్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియ‌ర్ నాయ‌కులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా హ‌రీశ్ రావు కేక్ క‌ట్ చేసి త‌న బావ కేటీఆర్ కు తినిపించారు. అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ మీద, తెలంగాణ మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ మట్టితో మమేకమైన వారికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వారికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి నడిచిన వారికి మాత్రమే జాతి అంటే ఏంటో, జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుందని అన్నారు కేటీఆర్. ఇలాంటి చిల్ల‌ర గాళ్ల మాట‌లు మాట్లాడే వారికి చ‌రిత్ర తెలియ‌ద‌ని అన్నారు. కేసీఆర్ ఆన‌వాళ్లు లేకుండా చెరిపేయాల‌ని అనుకోవ‌డం భ్ర‌మ త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. లోకం ఉన్నంత వ‌ర‌కు తెలంగాణ ఉంటుంద‌ని, తెలంగాణ ఉన్నంత వ‌ర‌కు కేసీఆర్ పేరు చిర‌స్థాయిగా నిలిచి పోతుంద‌న్నారు .
సమైక్యాంధ్రుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలియదు, నీతి తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకొని పోయిన జాతి ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తుందని ప్ర‌శ్నించారు.
The post బ‌రా బ‌ర్ కేసీఆర్ తెలంగాణ జాతిపిత : కేటీఆర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Vande Bharat 4.0: త్వరలో వందేభారత్‌ 4.0 – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌Vande Bharat 4.0: త్వరలో వందేభారత్‌ 4.0 – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌

Vande Bharat : భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వర్షన్‌ రానుంది. వందేభారత్‌ 4.0 (Vande Bharat)ను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) బుధవారం ప్రకటించారు. ఎగుమతి గిరాకీలకు అనుగుణంగా దాని రూపకల్పన ఉంటుందని వెల్లడించారు.

గ్లోబ‌ల్ టీచ‌ర్ ప్రైజ్ అందుకున్న రూబుల్ నాగిగ్లోబ‌ల్ టీచ‌ర్ ప్రైజ్ అందుకున్న రూబుల్ నాగి

దుబాయ్ : భార‌త దేశానికి చెందిన రూబుల్ నాగి సంచ‌ల‌నంగా మారారు. త‌ను దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన కార్య‌క్రమంలో అత్యుత్త‌మమైన ఉపాధ్యాయురాలి పుర‌స్కారం అందుకున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ భారత ఉపాధ్యాయుడిని ఉత్తమ అవార్డుతో సత్కరించారు. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన భారతీయ

ప్ర‌భాస్ రాజా సాబ్ త‌ప్ప‌కుండా హిట్ అవుతుందిప్ర‌భాస్ రాజా సాబ్ త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది

హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు మారుతి సీరియ‌స్ కామెంట్స్ చేశాడు. ప్ర‌భాస్ , మాళ‌విక మోహ‌న్, రిద్దీ కుమార్, నిధి అగ‌ర్వాల్ , సంజ‌య్ ద‌త్ తో క‌లిసి ది రాజా సాబ్ తీశాడు. దీనిని పీపుల్స్ మీడియా నిర్మించింది. భారీ బడ్జెట్