hyderabadupdates.com Celeb Gallery బాణసంచా పేలుడు…జ‌గ‌న్ దిగ్భ్రాంతి

బాణసంచా పేలుడు…జ‌గ‌న్ దిగ్భ్రాంతి

బాణసంచా పేలుడు…జ‌గ‌న్ దిగ్భ్రాంతి post thumbnail image

ఏపీలో బాణసంచా పేలుడు విషాదాన్ని నింపింది. కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ ఘటనపై వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌ లో పలువురు మరణించడం అత్యంత విషాదకరమని అన్నారు. రాయవరంలో జరిగిన ఘటన అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిందని విచారం వ్య‌క్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

కోనసీమ జిల్లాలో బాణాసంచా పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడిన సీఎం..సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

The post బాణసంచా పేలుడు…జ‌గ‌న్ దిగ్భ్రాంతి appeared first on Adya News Telugu.

Related Post