hyderabadupdates.com movies బాలయ్య ఇంటెన్సిటీని మ్యాచ్ చేయలేదా

బాలయ్య ఇంటెన్సిటీని మ్యాచ్ చేయలేదా

జన నాయకుడు ట్రైలర్ వచ్చాక అందరి డౌట్లు తీరిపోయాయి. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇది భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం జరుగుతూనే ఉంది కానీ టీమ్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. అనిల్ రావిపూడి, హెచ్ వినోత్ దీని గురించి నేరుగా స్పందించకుండా దాటవేస్తూ వచ్చారు. ఇవాళ ఫుల్ క్లారిటీ వచ్చింది.

సగం ట్రైలర్ పైగా విజువల్స్ రెండు సినిమాల్లో ఒకేలా అనిపించాయి. ఫ్యాక్టరీ ఫైట్ తో మొదలుపెట్టి జైలు ఎపిసోడ్ దాకా మక్కికి మక్కి అనిపించేంత పోలికలున్నాయి. పొలిటికల్ గా అదనపు మెరుగులు దిద్దారు కానీ ఓవరాల్ గా చూసుకుంటే సేటు టు సేమ్ అంటూ ట్విట్టర్ లో స్క్రీన్ షాట్లు పెట్టేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఎంత రీమేక్ అయినా భగవంత్ కేసరిలో ఉన్న ఇంటెన్సిటీ ఇప్పుడీ జన నాయకుడులో కనిపించలేదనే చెప్పాలి. బడ్జెట్ పరంగా పెద్దదే కావొచ్చు కానీ అనిల్ రావిపూడి టేకింగ్, బాలయ్య వయసు ప్లస్ హుందాతనం, తమన్ మ్యూజిక్ ఏవైతే మెయిన్ హైలైట్స్ గా నిలిచాయో అవి విజయ్ మూవీలో మిస్ అయినట్టుగా కనిపిస్తోంది.

పైగా బాబీ డియోల్ విలనిజంని మరింత వయొలెంట్ గా మార్చడంతో పాటు డార్క్ నైట్ తరహాలో ఏదో రోబోటిక్ తరహా పోరాట సన్నివేశాలు పెట్టడం కొంత ఆర్టిఫీషియల్ లుక్ ఇచ్చింది. ఇదంతా ఫ్యాన్స్ ని మెప్పించడం కోసమే కావొచ్చు కానీ సగటు ఆడియన్స్ కోణం నుంచి చూస్తే ఓవర్ ది బోర్డ్ అనిపిస్తాయి.

రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు తన చివరి సినిమాగా విజయ్ ఏరికోరి మరీ భగవంత్ కేసరిని ఎంచుకున్నాడు. అనిల్ రావిపూడిని పిలిపించి మరీ సూచనలు తీసుకున్నాడు. రీమేక్ కూడా డైరెక్ట్ చేయమని అడిగాడట కానీ కమిట్ మెంట్ల దృష్ట్యా అనిల్ ఒప్పుకోలేదని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు చూసిన కథనే మళ్ళీ జన నాయకుడులో మన జనాలు చూస్తారానేది వేయి డాలర్ల ప్రశ్న. స్ట్రెయిట్ సబ్జెక్టు అయ్యుంటే ఖచ్చితంగా తెలుగు సినిమాలకు కాంపిటీషన్ అయ్యేది కానీ రీమేక్ అయిపోయి ఆ ఛాన్స్ తగ్గించేసుకుంది. మరి తమిళ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Related Post

హ‌రీష్‌. గుంట‌న‌క్క‌: క‌వితహ‌రీష్‌. గుంట‌న‌క్క‌: క‌విత

బీఆర్ఎస్ మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత‌.. హ‌రీష్‌రావుపై ఆ పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురైన క‌విత తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల కాలంలో ఆమె హ‌రీష్‌రావుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఆదివారం సూర్యాపేట‌లో ప‌ర్య‌టించిన

టికెట్ రేట్లు ఎప్పటికైనా సమస్యేటికెట్ రేట్లు ఎప్పటికైనా సమస్యే

రాజు వెడ్స్ రాంబాయి సక్సెస్ ఈవెంట్ లో నిర్మాత బన్నీ వాస్ దగ్గరికి ఐబొమ్మ రవి అరెస్ట్ ప్రస్తావన వచ్చింది. సోషల్ మీడియాలో తనపై సానుభూతి పెరుగుతోందని, టికెట్ రేట్ల వల్లే జనాలు పైరసీకి అలవాటు పడిపోయి అతన్ని కొందరు హీరోలా

బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్

ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన శైలిని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా సినిమా తీసే దర్శకుల కోసం చూస్తుంటారు. ఆ హీరో కెరీర్లో ది బెస్ట్