రీసెంట్‌గా ఇస్రో లాంచ్ చేసిన LVM3-M5 ‘బాహుబలి’ రాకెట్ ప్రయోగం మన దేశానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే, 4,410 కిలోల బరువున్న CMS-03 శాటిలైట్‌ను ఇండియా నుంచి పంపడం అనేది మామూలు విషయం కాదు. ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడం వల్ల, ఈ రాకెట్ దేశానికి ఎలా యూజ్ అవుతుంది, అలాగే ఇస్రో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనే వివరాల్లోకి వెళితే..
ఫారెన్ హెల్ప్ అవసరం లేదు
గతంలో, మనం భారీ శాటిలైట్‌లను పంపాలంటే కచ్చితంగా ఫ్రాన్స్‌కు చెందిన ఏరియానె లాంటి ఫారెన్ రాకెట్స్‌పై ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు మన LVM3 రాకెట్ సక్సెస్‌తో, ఆ అవసరం లేదనే సందేశం వెళ్లింది. అంటే, ‘ఆత్మనిర్భర్ భారత్’ టార్గెట్‌కు ఇది ఒక బిగ్గెస్ట్ సపోర్ట్. మన డబ్బు, మన టెక్నాలజీ, మన ప్రయోగం అని చెప్పవచ్చు.
పవర్ ఫుల్ కమ్యూనికేషన్
CMS-03 లాంటి భారీ కమ్యూనికేషన్ శాటిలైట్లను పంపడం వల్ల, ఇండియాలో ఇంటర్నెట్, డిఫెన్స్ కమ్యూనికేషన్స్ మరింత స్ట్రాంగ్‌గా మారుతాయి. ఈ శాటిలైట్ దాదాపు 15 ఏళ్ల పాటు సర్వీస్ ఇస్తుంది. మన దేశంలోని దూర ప్రాంతాలకు, చుట్టూ ఉన్న సముద్రంలో కనెక్టివిటీకి ఇది చాలా కీలకం.
LVM3 రాకెట్ అనేది చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశారు. ఇది 4,000 కిలోల బరువున్న శాటిలైట్‌ను హై ఆర్బిట్‌కు, 8,000 కిలోల పేలోడ్‌ను లో ఆర్బిట్‌కు తీసుకెళ్లగలదు. ఈ కెపాసిటీని ఇస్రో అతిపెద్ద మిషన్ అయిన ‘గగన్‌యాన్’ (మనుషులను స్పేస్‌లోకి పంపే మిషన్) కోసం వాడుతోంది. ఈ రాకెట్‌ను హ్యూమన్ రేటెడ్ వెర్షన్‌లో (HRLV) మార్చి వాడతారు.
బిజినెస్ బూస్ట్
LVM3 రాకెట్ ప్రతిసారీ సక్సెస్ అవుతోంది 100% సక్సెస్ రేట్ అని కూడా చెప్పవచ్చు. ఈ నమ్మకంతో, ఇస్రో ఇప్పుడు ఇతర దేశాల పెద్ద శాటిలైట్‌లను కూడా కమర్షియల్‌గా ప్రయోగించే అవకాశం దొరుకుతుంది. ఇది ఇస్రోకి బిజినెస్ పరంగా, దేశానికి ఆదాయం పరంగా పెద్ద బూస్ట్ అవుతుంది.
చంద్రయాన్ 3 ని విజయవంతంగా పంపింది కూడా ఈ రాకెట్ సిరీస్సే. అందుకే ఈ రాకెట్‌ను ‘బాహుబలి’ అని ముద్దుగా పిలుస్తున్నారు. ఈ తాజా విజయంతో, ఇండియా ఇప్పుడు హెవీ లిఫ్ట్ లాంచర్స్ ఉన్న అగ్రదేశాల జాబితాలో గట్టిగా నిలబడింది.