hyderabadupdates.com Gallery బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌

బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌

బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌ post thumbnail image

హైద‌రాబాద్ : ఓ వైపు అధికారాన్ని కోల్పోయినా బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ వాణిని వినిపిస్తూ వ‌స్తున్న భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ కు కంట్లో న‌లుసు లాగా త‌యారైంది త‌న స్వంత, ముద్దుల కూతురు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శాస‌న మండ‌లిలో ఇవాళ ఆమె సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. అంతే కాదు తాను త‌న శాస‌న మండ‌లి స‌భ్యురాలి ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. గ‌తంలోనే ఇచ్చాన‌ని, కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆమోదించ లేద‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న రాజీనామా లేఖ‌ను ఆమోదించాల‌ని మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిని కోరారు. ఇదే స‌మ‌యంలో త‌న‌కు మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు.
విచిత్రంగా త‌న తండ్రిని, మాజీ మంత్రులు త‌న్నీరు హ‌రీష్ రావు, కేటీఆర్ ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆమె మండ‌లి సాక్షిగా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌కు దారి తీశాయి. ప్ర‌ధానంగా మాజీ మంత్రులు చేసిన అక్ర‌మాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఇదే స‌మ‌యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి కలెక్టరేట్ భవ‌నాల వరకు అన్నిట్లో అవినీతికీ పాల్పడ్డారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. సిరిసిల్ల, సిద్దిపేట కలెక్టరేట్ భవనాలు ఎంత నాణ్యతతో కట్టారు అంటే కట్టిన మొదటి ఏడాదే నీటిలో మునిగి పోయాయంటూ ఎద్దేవా చేశారు. అమర వీరుల గుర్తుగా కట్టిన అమరజ్యితి నిర్మాణంలో కూడా అవినీతికి పాల్ప‌డ్డారంటూ ఫైయ్యారు.
The post బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Amit Shah: తనయుల కోసం సోనియా, లాలూ ఆరాటం – అమిత్ షాAmit Shah: తనయుల కోసం సోనియా, లాలూ ఆరాటం – అమిత్ షా

Amit Shah : తనయుడు రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ, కుమారుడు తేజస్విని బిహార్‌ కు ముఖ్యమంత్రిగా చూడాలని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ పరితపిస్తున్నా ఆ రెండు పదవులూ ఖాళీగా లేవని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Maharashtra: అవినీతిలో అగ్రస్థానంలో మహారాష్ట్ర !Maharashtra: అవినీతిలో అగ్రస్థానంలో మహారాష్ట్ర !

    దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే అవినీతిలో మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,875 అవినీతి కేసులు నమోదు కాగా ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 795 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి సిస్కో స‌హ‌కారంతెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి సిస్కో స‌హ‌కారం

దావోస్ : తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన స్కిల్ యూనివ‌ర్శిటీకి ప్ర‌ముఖ సంస్థ సిస్కో స‌హ‌కారం అందించేందుకు ముందుకు వ‌చ్చింది. దావోస్ వేదిక‌గా జ‌రుగుతున్న ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సులో సంస్థ ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ సంద‌ర్బంగా సిస్కోకు ధ‌న్య‌వాదాలు