hyderabadupdates.com Gallery బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తాం : స‌విత

బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తాం : స‌విత

బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తాం : స‌విత post thumbnail image

విజయవాడ : ఉన్నత ఉద్యోగాల్లో బీసీ బిడ్డలు స్థిరపడి, పాలనలో కీలక భూమిక పోషించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. అందుకోసమే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందజేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగరం గొల్లపూడి బీసీ భవన్ లో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్స్ కోచింగ్ సెంటర్ ను మంత్రి సవిత సందర్శించారు. ఈ సందర్బంగా బీసీ అభ్యర్థులకు వివిధ సబ్జెక్టులకు చెందిన 43 రకాల మెటీరియల్ ను వారికి అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగంలో ఉండే కీలక స్థానాల్లో బీసీ యువత ఉండాలన్నది సీఎం చంద్రబాబు నాయుడుసంకల్పమన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందజేయాలని సీఎం నిర్ణయించారని చెప్పారు మంత్రి ఎస్. స‌విత‌. 16,457 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగానే, బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఆఫ్ లైన్ కోచింగ్ ప్రారంభించామన్నారు. ఇంటి వద్ద ఉండే మహిళలకు, పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకునే బీసీ అభ్యర్థుల కోసం ఉచిత ఆన్ లైన్ కోచింగ్ కూడా నిర్వహించామన్నారు స‌విత‌. రాష్ట్ర వ్యాప్తంగా 300ల మంది బీసీ అభ్యర్థులు టీచర్లగా ఎంపికయ్యారన్నారు. గతేడాది ఉచిత సివిల్స్ కోచింగ్ కూడా నిర్వహించామన్నారు. సివిల్స్ కోచింగ్ తీసుకున్నవారిలో పలువురు గ్రూప్ -1, రైల్వే, బ్యాంకులు వంటి రంగాల్లోనూ ఉద్యోగాలు సాధించారన్నారు.
The post బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తాం : స‌విత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రెండు వేర్వేరు కేసుల‌పై పై సిట్ ఏర్పాటురెండు వేర్వేరు కేసుల‌పై పై సిట్ ఏర్పాటు

హైద‌రాబాద్ : తెలంగాణ డీజీపీ శివ ధ‌ర్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రెండు వేర్వేరు కేసుల‌కు సంబంధించి సిట్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. దీనికి సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ ప‌ర్య‌వేక్షిస్తార‌ని తెలిపారు. మంగ‌ళ‌వారం డీజీపీ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్

అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీఅతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ

అమరావతి : ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు, 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు

ఖ‌ర్గే సార‌థ్యంలో సీఎం, మంత్రుల భేటీఖ‌ర్గే సార‌థ్యంలో సీఎం, మంత్రుల భేటీ

న్యూఢిల్లీ : పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు శ్రమించాల‌ని అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు సారథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత‌, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,