hyderabadupdates.com Gallery బుక‌ర్ ప్రైజ్ రేసులో ప‌ద్మ విశ్వ‌నాథ‌న్

బుక‌ర్ ప్రైజ్ రేసులో ప‌ద్మ విశ్వ‌నాథ‌న్

బుక‌ర్ ప్రైజ్ రేసులో ప‌ద్మ విశ్వ‌నాథ‌న్ post thumbnail image

అమెరికా : భార‌తీయ సంత‌తికి చెందిన ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి ప‌ద్మ విశ్వ‌నాథ‌న్ సంచ‌ల‌నంగా మారారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కమైన బుక‌ర్ ప్రైజ్ షార్ట్ లిస్టులో చేరింది త‌ను రాసిన పుస్త‌కం. షిదా బజ్యార్ , రెనే క‌రాబాష్, డేనియ‌ల్ కెహ్ట్ మాన్, యాంగ్ షువాంగ్ జీ , మేరీ ఎన్డీయేల ర‌చ‌న‌లు కూడా ఉన్నాయి. ఇక ప‌ద్మ విశ్వ‌నాథ‌న్ భార‌త దేశపు మూలాలు క‌లిగిన ర‌చయిత్రి. త‌ను కెన‌డియ‌న్ – అమెరిక‌న్ ర‌చయిత్రిగా గుర్తింపు పొందారు. పోర్చుగీస్ భాషలోని ఒక నవలికకు ఆంగ్ల అనువాదకురాలిగా 2026 అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడ్డారు. బ్రెజిలియన్ రచయిత్రి అనా పౌలా మైయా రాసిన ‘ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈజ్ బినీత్’కు ఆమె అనువాదం చేశారు. ఎంపిక చేసిన జాబితాలో ఆరు ర‌చ‌న‌లు ఉన్నాయి.
ఈ సంద‌ర్బంగా ప‌ద్మ విశ్వ‌నాథ‌న్ చేసిన అనువాదం గురించి న్యాయ నిర్ణేత‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ పుస్తకాన్ని సుదూర బ్రెజిలియన్ శిక్షా కాలనీ నేపథ్యంలో సాగే ఒక క్రూరమైన, వెంటాడే ,సమ్మోహనపరిచే నవలిక, ఇక్కడ న్యాయం ,క్రూరత్వం మధ్య సరిహద్దులు కూలిపోతాయి అని వర్ణించారు. ఇక ర‌చ‌యిత‌,, అనువాదకుడికి సమానంగా పంచే £50,000 విలువైన ఈ బహుమతిని గత సంవత్సరం ‘హార్ట్ ల్యాంప్’ నవలకు కన్నడ రచయిత్రి బాను ముస్తాఖ్, అనువాదకురాలు దీపా భాస్తిలకు ప్రదానం చేశారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన ప్రతి ఎంట్రీకి £5,000 లభిస్తుంది, దీనిని కూడా రచయిత, అనువాదకుడికి పంచుతారు. ఈ పుస్త‌కం ఒక మారుమూల జైలు, కొద్దిమంది మనుషులు, వారి జీవితాలను శాసించే శిక్షా పద్ధతులు. ఈ నవల దాదాపు అధికారం వెనుక దాగి ఉన్న చీక‌టి కోణాన్ని వివ‌రిస్తుంద‌ని ఎంపిక క‌మిటీ తెలిపింది.
The post బుక‌ర్ ప్రైజ్ రేసులో ప‌ద్మ విశ్వ‌నాథ‌న్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Bhatti Vikramarka: హైదరాబాద్‌ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు – భట్టి విక్రమార్కBhatti Vikramarka: హైదరాబాద్‌ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు – భట్టి విక్రమార్క

Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్ర వనరులు, అవకాశాలపై ప్రచారం బాధ్యత నరెడ్కోపై ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అన్నివైపులా హైదరాబాద్ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని చెప్పారు. నరెడ్కో ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు.

Telangana Government: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వంTelangana Government: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Government : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులు సుమారు 1,031 కోట్లు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం

Sabarimala Gold: శబరిమల బంగారు తాపడాల బరువులో తగ్గుదలలో ఆశక్తికర విషయాలుSabarimala Gold: శబరిమల బంగారు తాపడాల బరువులో తగ్గుదలలో ఆశక్తికర విషయాలు

Sabarimala : శబరిమల ఆలయంలో గర్భగుడి ద్వారపాలక విగ్రహాలకు అమర్చిన బంగారు తాపడాలు బరువు తగ్గడంపై ప్రస్తుతం కేరళ హైకోర్టులో (Kerala High Court) విచారణ జరుగుతుంది. బంగారు తాపడాల విషయంలో అన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని న్యాయస్థానం ఈ సందర్భంగా