hyderabadupdates.com movies బూతుకి బోల్డుకి తేడా ఉంది నిజమే కానీ

బూతుకి బోల్డుకి తేడా ఉంది నిజమే కానీ

కొన్ని నెలల క్రితం మాస్ జాతర నుంచి ఓలే ఓలే లిరికల్ సాంగ్ వచ్చినప్పుడు అందులో బూతుల గురించి పెద్ద డిబేటే జరిగింది. దానికి స్పందించే అవకాశం టీమ్ కి దొరకలేదు కానీ, రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యాక ప్రమోషన్లు మొదలు పెట్టడంతో హీరో రవితేజ, దర్శకుడు భాను భోగవరపు దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని బోల్డ్ మూవీస్ కి స్టాంప్ వేసేసి అందులో ఎంత డబుల్ మీనింగ్ ఉన్నా ఎవరూ అడగరని, కానీ తన సినిమా దగ్గరికి వచ్చేటప్పటికీ మాత్రమే బ్యాడ్ ఎలా కనిపించిందని దర్శకుడు భాను ప్రశ్నించారు. ఉత్సవాల్లో ప్రేమగా తిట్టుకునే పదాలనే పాటలో పెట్టినట్టు సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.

ఆయన చెప్పిన దాంట్లో కొంత లాజిక్ ఉన్నా దాన్ని పూర్తిగా అంగీకరించలేం. ఉదాహరణకు ఒక ఆగిపోయిన బైకుని వెనుక నుంచి ఒక ఆటో వచ్చి గుద్దిందనుకుందాం. వెంటనే ఇద్దరు డ్రైవర్ల మధ్య సంభాషణ ఎలా ఉంటుంది. పచ్చి బూతులతో ఒకళ్ళనొకళ్ళు తిట్టి పోసుకుంటారు. ఇది నిజ జీవితంలో చాలాసార్లు చూసి ఉంటాం. ఇప్పుడు రవితేజ లాంటి స్టార్ సినిమాలో ఇలాంటి సీన్ పెట్టినప్పుడు యధాతథంగా అవే బూతులు పెట్టేసి రియల్ లైఫ్ నుంచి తీసుకున్నామని క్యాప్షన్ వేసి తప్పించుకోలేం. ఎందుకంటే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరు కాబట్టి. అది డైలాగులకైనా పాటలకైనా ఒకటే సూత్రం వర్తిస్తుంది.

కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ కు సైతం ఇదే ఇబ్బంది తలెత్తింది. ట్రైలర్ లో బూతులు చూసి వామ్మో ఇవేం మాటలని అనుకున్న వాళ్ళు లేకపోలేదు. దానికి నరేష్, కిరణ్ ఇద్దరూ తమ వంతుగా భాను తరహాలో కవరింగ్ చేశారు కానీ అసలు సినిమా చూశాకే ఒక క్లారిటీ వస్తుంది. జన జీవనంలో నిత్యం బూతు ఉంటుంది. అందులో డౌట్ లేదు. కానీ అది సందర్భానికి తగ్గట్టు ఒకరిద్దరికి లేదా ఒక గుంపుకి ఉంటుంది. అదే తెరమీదకు వెళ్ళినప్పుడు కోట్లాది ప్రేక్షకులకు చేరుతుంది. అందుకే రచయితలు, దర్శకులు జాగ్రత్తగా ఉంటారు. మరి మాస్ జాతర, కె ర్యాంప్ చేసుకున్న డిఫెన్స్ లో ఎంత నిజముందో అర్థం కావాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. 

Related Post

`వేమిరెడ్డి` వేడి.. వైసీపీని ద‌హిస్తుందా.. !`వేమిరెడ్డి` వేడి.. వైసీపీని ద‌హిస్తుందా.. !

రాజ‌కీయంగా ప్ర‌శాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రినీ టార్గెట్ చేయ‌లేదు. త‌న స‌తీమ‌ణి, ఎమ్మెల్యే ప్ర‌శాంతి రెడ్డిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు, వైసీపీ నేత‌లు యాగీ చేసిన‌ప్పుడు కూడా ఆయ‌న సైలెంట్‌గానే ఉన్నారు. కానీ.. తాజాగా

“Vijay Deverakonda Is My Favourite Telugu Actor,” Says Dhurandhar Actress Sara Arjun“Vijay Deverakonda Is My Favourite Telugu Actor,” Says Dhurandhar Actress Sara Arjun

Young actress Sara Arjun has shared her admiration for Telugu star Vijay Deverakonda, calling him her favourite actor from the Telugu film industry. Her statement has quickly caught the attention