hyderabadupdates.com Gallery బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ post thumbnail image

ముంబై : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ధురంధ‌ర్. పాకిస్తాన్ లో ఇండియ‌న్ ఆఫీస‌ర్ గూఢ‌చారిగా వ్య‌వ‌హ‌రించిన క‌థ‌నం ఆధారంగా తెర‌కెక్కించాడు. ఈ సినిమా విడుద‌లైన తొలి షో నుంచి భారీ ఎత్తున ఆద‌ర‌ణ చూర‌గొంది. ఏకంగా రూ. 1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఈ సినిమాను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. అయితే ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ ఎప్పుడు అవుతుంద‌నే దానిపై అభిమానులు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. తెర‌పై స‌త్తా చాటిన ఈ మూవీ బిగ్ షాక్ ఇచ్చింది. సినీ వ‌ర్గాలు సైతం విస్తు పోయేలా కాసుల వ‌ర్షం కురిపించింది. తెర‌పై అద్భుత స‌క్సెస్ ను మూట‌గ‌ట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు డిజిట‌ల్ రంగ ప్ర‌వేశానికి రెడీ అవుతోంది. అద్భుత‌మైన చిత్రీక‌ర‌ణ‌, ఆక‌ట్టుకునే సంభాష‌ణ‌లు, అంత‌కు మించి ర‌ణ్ వీర్ సింగ్ , సారా జాన్స‌న్ న‌టన అభిమానుల‌ను విస్మ‌య ప‌రిచింది.
ఇదిలా ఉండ‌గా సినీ ప‌రిశ్ర‌మ‌లో పెద్ద ఎత్తున దురంధ‌ర్ మూవీ స్ట్రీమింగ్ పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 30న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంద‌ని టాక్. దీనిపై బ‌ల‌మైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికారిక ఓటీటీ విడుదల తేదీకి సంబంధించిన ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం అన్‌కట్ వెర్షన్‌ను స్ట్రీమ్ చేయవచ్చని పుకార్లు వస్తున్నాయి, అయితే ఇది కూడా అధికారికంగా ధృవీకరించ లేదు సంస్థ‌. ఇక దురంధ‌ర్ మూవీ లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారాడు అక్ష‌య్ ఖ‌న్నా. త‌ను ఈ సినిమాకు అస్సెట్ అయ్యాడ‌న‌డంలో సందేహం లేదు.
The post బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ధర్మవరం మెగా క్లస్టర్ తో మ‌హిళ‌ల‌కు ఉపాధిధర్మవరం మెగా క్లస్టర్ తో మ‌హిళ‌ల‌కు ఉపాధి

అమరావతి : ధర్మరంలో రూ.38.03 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ క్లస్టర్ ఏర్పాటుతో 22 వేల మంది మహిళలకు లబ్ది కలగనుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. అనంతపురం నియోజక వర్గంలో ఎంఎస్ఎంఈ

CM Chandrababu: మొంథా తుపానుతో ఏపీకి రూ.5,265 కోట్ల నష్టంCM Chandrababu: మొంథా తుపానుతో ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం

    ‘మొంథా’ తుపాను వల్ల రాష్ట్రానికి రూ.5,265 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ రంగానికి రూ.829 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.2,079 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు. తుపాను

DGP Shivadhar Reddy: తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత బండి ప్రకాశ్‌ సరెండర్‌DGP Shivadhar Reddy: తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత బండి ప్రకాశ్‌ సరెండర్‌

DGP Shivadhar Reddy : మావోయిస్ట్ పార్టీ కీలక నేత బండి ప్రకాష్ తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) సమక్షంలో లొంగిపోయారు. ఆశన్న లొంగుబాటు సమయంలోనే ప్రకాశ్‌ కూడా లొంగిపోతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. బండి ప్రకాశ్‌