hyderabadupdates.com Gallery భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి post thumbnail image

హైద‌రాబాద్ : గోదావ‌రి పుష్క‌రాల‌ను క‌నీవిని ఎరుగ‌ని రీతిలో నిర్వహించాల‌ని అన్నారు మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్. సెక్రటేరియట్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన “గోదావరి పుష్కరాలు–2027 కేబినెట్ సబ్ కమిటీ” తొలి సమావేశంజరిగింది. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు. పుష్క‌రాల నిర్వ‌హ‌ణ కోసం సీఎం ప్ర‌త్యేక దృష్టి సారించార‌ని చెప్పారు. రాష్ట్ర ప్రతిష్ఠకు అనుగుణంగా పుష్కరాల ఏర్పాట్లు అత్యంత ప్రాముఖ్యంతో చేపట్టాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించినట్లు చెప్పారు.గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలకు తరలి వస్తారని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గోదావరి తీరం విస్తరించి ఉండటంతో పాటు అక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయ‌ని తెలిపారు. దీంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సహా గోదావరి తీరం వెంట ఉన్న ఆలయాలను దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు అడ్లూరి లక్ష్మ‌ణ్‌.
ఘాట్‌ల అభివృద్ధి, తాత్కాలిక స్నాన ఘాట్‌లు, రహదారుల విస్తరణ, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్య సేవలు, భద్రత వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. పుష్కరాల సమయంలో భక్తులకు సౌకర్యవంతమైన రవాణా కోసం ప్రత్యేక బస్సులు, తాత్కాలిక వసతి కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే విపత్తు నిర్వహణ, పోలీస్ భద్రత, వైద్య అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
The post భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కోసం భార‌త్ స‌న్న‌ద్దంవ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కోసం భార‌త్ స‌న్న‌ద్దం

ముంబై : కోట్లాది మంది భార‌తీయులు ఇవాళ ముంబై వేదిక‌గా జ‌రిగే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. వెస్టిండీస్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి భార‌త్ ను సెమీస్ చేర్చిన సంజూ శాంస‌న్ పై

అంచ‌నాలు పెంచుతున్న జైల‌ర్ -2 చిత్రంఅంచ‌నాలు పెంచుతున్న జైల‌ర్ -2 చిత్రం

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన అరుదైన న‌టుడు ర‌జనీకాంత్. త‌ను న‌టిస్తున్న తాజా సీక్వెల్ చిత్రం జైల‌ర్ -2 మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా త‌లైవా వెల్ల‌డించ‌డం విశేషం.

కిమ్ వారసురాలిగా కిమ్ కూతురుకిమ్ వారసురాలిగా కిమ్ కూతురు

ఉత్త‌ర కొరియా : ఉత్త‌ర కొరియాలో ఏం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ కొన‌సాగుతోంది. ప్రస్తుతం ఆ దేశానికి కిమ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. త‌న త‌దుప‌రి పాల‌కురాలిగా త‌న కూతురుగా కిమ్ జు ఏ కానుందా. అవున‌నే జ‌నం అంటున్నారు. దక్షిణ కొరియా