hyderabadupdates.com Gallery ‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’ స్ట్రీమింగ్ పై ఉత్కంఠ‌

‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’ స్ట్రీమింగ్ పై ఉత్కంఠ‌

‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’ స్ట్రీమింగ్ పై ఉత్కంఠ‌ post thumbnail image

హైద‌రాబాద్ : మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, ఆషికా రంగ‌నాథ్, డింపుల్ హ‌యాతి కీ రోల్స్ పోషించిన చిత్రం భ‌ర్త మ‌హాశ‌యులుకు విజ్ఞ‌ప్తి. సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో పాటు మ‌రికొన్ని సినిమాలు విడుద‌ల‌య్యాయి. కానీ అన్ని సినిమాల‌ను తోసి రాజ‌ని మెగాస్టార్ చిరంజీవి , న‌య‌న‌తార‌, విక్ట‌రీ వెంక‌టేశ్ క‌లిసి న‌టించిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ టాప్ లో నిలిచింది. ఇదే క్ర‌మంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ది రాజా సాబ్ బోల్తా ప‌డింది. అయితే రాంబాయి మూవీ ఊహించ‌ని రీతిలో పాజిటివ్ టాక్ తో స‌క్సెస్ అయ్యింది. భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి చిత్రం మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది.
మెగా మూవీకి సంగీతం అందించిన భీమ్స్ సిసిరిలియోనే ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. మ్యాజిక్ చేశాడు. పాట‌లు దుమ్ము రేపాయి. అయితే ఓటీటీలోకి ఫిబ్ర‌వ‌రి 13న వ‌స్తుంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది టాలీవుడ్ లో. కానీ సినిమా మేక‌ర్స్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. దీనిని పూర్తిగా రొమాంటిక్ కామెడీగా తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం పెద్దగా ప్రీ-రిలీజ్ బజ్ లేకుండా ప్రారంభమైంది, ముఖ్యంగా నటుడి ఇటీవలి ప్రాజెక్ట్‌ల పేలవమైన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే. నిరాడంబరమైన అంచనాలు ఉన్నప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి రన్‌ను నమోదు చేయగలిగింది. తాజాగా ఫిబ్రవ‌రి 20న జీ5 లో భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి స్ట్రీమింగ్ అవుతుంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇప్ప‌టికే మెగాస్టార్ మూవీ ఇందులోనే భారీ ధ‌ర‌కు స్ట్రీమింగ్ అయిన విష‌యం ప్రేక్ష‌కుల‌కు తెలిసిందే.
The post ‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’ స్ట్రీమింగ్ పై ఉత్కంఠ‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

క‌ళ‌లు, సంస్కృతికి పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తాంక‌ళ‌లు, సంస్కృతికి పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తాం

విజ‌య‌వాడ : క‌ళ‌లు, సంస్కృతికి పూర్వ వైభ‌వాన్ని తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు రాష్ట్ర ప‌ర్యాట‌క , సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్ర స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా విజ‌య‌వాడ వేదిక‌గా పెద్ద ఎత్తున అమ‌రావ‌తి ఆవ‌కాయ్ ఫెస్టివ‌ల్