hyderabadupdates.com movies భాగ్యశ్రీ బోర్సే ధీమా అందుకేనేమో

భాగ్యశ్రీ బోర్సే ధీమా అందుకేనేమో

టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ లక్కీ హీరోయిన్ ఎవరయ్యా అంటే భాగ్యశ్రీ బోర్సే పేరే వినిపిస్తోంది. ఎందుకంటే తొలి రెండు సినిమాలు డిజాస్టర్లు అయినా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అందం, చందం, నటన మూడు ఉండటంతో దర్శకులు ఛాన్సులు ఇస్తున్నారు. ఈమె నటించిన కొత్త మూవీ కాంత ఈ వారమే థియేటర్లలో అడుగు పెడుతోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ డ్రామా కోలీవుడ్ బ్యాక్ డ్రాప్ లో 1950 నేపథ్యంతో సాగుతుంది. నేటివిటీ పరంగా ఇబ్బంది లేకుండా అన్ని బాషల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట.

ఇదిలా ఉండగా పలు ఇంటర్వ్యూలలో భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ ఈసారి తనలో రియల్ పెర్ఫార్మర్ ని చూస్తారని నొక్కి చెబుతోంది. అంత ధీమా ఏమిటయ్యా అంటే ఇన్ సైడ్ ఒకటి వినిపిస్తోంది. దాని ప్రకారం కాంత కథ ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, సముతిరఖని మధ్య అంతర్యుద్ధం ప్రధానంగా సాగుతుంది. వీళ్ళ మధ్యలో జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ లో కీలక మలుపులకు కారణమయ్యే పాత్రలో భాగశ్రీ బోర్సేకు నటన పరంగా చాలా స్కోప్ దొరికిందట. ముఖ్యమైన ట్విస్ట్ ఏంటో ఇక్కడ చెప్పడం భావ్యం కాదు కానీ ఊహించని విధంగా టర్న్ అయ్యే తీరు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేయడం అయితే ఖాయం.

కాంత హిట్ అయితే తమిళంలోనూ అడుగు పెట్టొచ్చు. ఎలాగూ ఈ నెలాఖరున వస్తున్న ఆంధ్రకింగ్ తాలూకా మీద పాజిటివ్ వైబ్స్ చాలా ఉన్నాయి. అది కూడా సక్సెస్ అయితే రామ్ తో పాటు సినిమాలో ఉపేంద్ర కూడా ఉన్నారు కాబట్టి శాండల్ వుడ్ నుంచి ఆఫర్లు తలుపు తట్టొచ్చు. సో ముందైతే కాంత విజయవంతమైతే నవంబర్ నెల తనకు శుభ సూచకంగా మారుతుంది. క్యామియోలతో హిందీలో గతంలో డెబ్యూలు చేసినప్పటికీ అవి తనకు ఆశించినంత పేరు తీసుకురాలేదు. అందుకే సౌత్ మార్కెట్ మీద దృష్టి పెడుతోంది. ఇంత కాన్ఫిడెన్స్ గా ఉందంటే మహానటిలో కీర్తి సురేష్ రేంజ్ లో ఏమైనా ఆశించవచ్చేమో.

Related Post

మన దేశం పౌరసత్వం కోసం అతను చేసింది త్యాగమేమన దేశం పౌరసత్వం కోసం అతను చేసింది త్యాగమే

విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్‌షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్‌పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు. కానీ జర్మనీలో తొమ్మిదేళ్లుగా ఉంటున్న మయూఖ్ పాంజా అనే యువకుడు మాత్రం ఇందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నాడు. తనకు జర్మన్

రాజుగారి లాగే అందరూ పవన్ మాట వింటే…రాజుగారి లాగే అందరూ పవన్ మాట వింటే…

తెలుగు సినీ పరిశ్రమకు ఎప్పట్నుంచో హైదరాబాద్ కేంద్రంగా ఉంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా ఇండస్ట్రీకి హైదరాబాదే కేంద్రం. ఐతే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌ను కూడా షూటింగ్‌ల కోసం ఉపయోగించుకోవాలని, అవసరమైన ప్రోత్సాహాలన్నీ అందిస్తామని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు