hyderabadupdates.com movies భారత్, ఇంగ్లాండ్ సెమీస్ రద్దయితే…

భారత్, ఇంగ్లాండ్ సెమీస్ రద్దయితే…

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ఒకవేళ వర్షం కారణంగా రద్దయితే పరిస్థితి ఏంటనేది అందరిలో ఉన్న డౌట్. ప్రస్తుతం ముంబై వాతావరణం అయితే అనుకూలంగానే ఉంది. వర్షం పడే అవకాశాలు తక్కువే. ఒకవేళ వాతావరణం సహకరించకుంటే మాత్రం దానిపై టోర్నీ నిబంధనలు క్లియర్‌గా ఉన్నాయి. ఆట సాధ్యం కాని పక్షంలో టీమ్ ఇండియాకు నిరాశ తప్పదు.

సూపర్ 8 పాయింట్ల పట్టికలో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. టేబుల్ టాపర్లకు ఉండే వెయిటేజీ ఇక్కడ ఇంగ్లాండ్‌కు ప్లస్ కానుంది. ఈ మెగా ఫైట్ కోసం ఇప్పటికే ఒక రిజర్వ్ డేని కేటాయించారు. ఒకవేళ నిర్ణీత రోజున ఫలితం తేలకపోతే మరుసటి రోజున ఆటను పూర్తి చేస్తారు. మ్యాచ్ నిర్వహణ కోసం గురువారం అదనంగా 90 నిమిషాలు, శుక్రవారం 120 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది.

కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉన్నా ఆడిస్తారు. అప్పటికీ ఫలితం రాకపోతేనే సూపర్ 8 పాయింట్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. సూపర్ 8 గ్రూప్ స్టేజ్‌లో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. భారత్ మాత్రం రెండు విజయాలు సాధించి రెండో స్థానంలో ఉంది. ఒకవేళ రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు రద్దయితే, తమ గ్రూప్‌లలో టాప్ ప్లేస్‌లో ఉన్న ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు ఫైనల్‌లో తలపడతాయి. అంటే గ్రూప్ దశలో మెరుగైన ఆటతీరు కనబరిచిన జట్లకు ఇలాంటి సమయంలో అదనపు ప్రయోజనం లభిస్తుంది.

గత రికార్డులు చూస్తే భారత్, ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ పోరు ఎప్పుడూ ఉత్కంఠగానే సాగుతోంది. 2022లో ఇంగ్లాండ్ గెలిచి ఛాంపియన్‌గా నిలిస్తే, 2024లో భారత్ విజయం సాధించి కప్ కైవసం చేసుకుంది. విచిత్రంగా గత రెండు సార్లు ఈ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్‌లో ఎవరు గెలిస్తే వారే వరల్డ్ కప్ కొడుతున్నారు. ఈ సారి కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అందుకే మ్యాచ్ రద్దయి నిబంధనల ప్రకారం కాకుండా, మైదానంలో ఆట ద్వారా ఫలితం రావాలని కోరుకుంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా సూపర్ 8లో వెస్టిండీస్‌పై ఘనవిజయంతో సెమీస్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టేందుకు ఆటగాళ్లంతా పవర్ఫుల్ ఫామ్ తో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇంగ్లాండ్ మొదట వీక్ గానే కనిపించినా తెలివిగా ఆడుతూ సెమీస్ కు చేరింది.

Related Post

వైఎస్ మృతిపై అచ్చన్నాయుడు సంచలన వ్యాఖ్యలువైఎస్ మృతిపై అచ్చన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. తండ్రి మరణం ఇంకా నిర్ధారణ కాక

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలిఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు. “ఏదో ఇచ్చేశాం.. మీరేదో ఖ‌ర్చు చేసేశాం.. అంటే కుద‌ర‌దు. ప్ర‌తి రూపాయికీ ఫ‌లితం చూపించాలి. అది ఎలా వినియోగం అవుతోంది? ఎవ‌రికి