hyderabadupdates.com movies భారత్ భారీ విజయం.. కానీ…

భారత్ భారీ విజయం.. కానీ…

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో టీమిండియా ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపుతో భారత్ 2 పాయింట్లు నెట్ రన్ రేట్ -0.100 కు చేరి పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి ఎగబాకింది. మరోవైపు, సౌత్ ఆఫ్రికా చేతిలో వెస్టిండీస్ ఓడిపోవడంతో భారత్‌పై ఉన్న ఒత్తిడి కొంతవరకు తగ్గింది. ఇప్పుడు మార్చి 1న వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది.

ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. నిర్ణీత 20 ఓవర్లలో 256/4 వంటి భారీ స్కోరు సాధించి తమ పవర్ ఏంటో చూపించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ (55), హార్దిక్ పాండ్యా (50*), తిలక్ వర్మ (44*) మెరుపు ఇన్నింగ్స్‌లతో స్టేడియంను హోరెత్తించారు. ఇషాన్ కిషన్ (38), సూర్యకుమార్ యాదవ్ (33) కూడా కీలక పరుగులు జోడించడంతో భారత్ ఈ వరల్డ్ కప్‌లోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది.

అయితే, బ్యాటింగ్ లో చూపించిన దూకుడు బౌలింగ్ లో కనిపించకపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అంత భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే ఏకంగా 184 పరుగులు చేసిందంటే మన బౌలింగ్ ఎంత సాధారణంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ టోర్నీలో ఏ జట్టు మీద కొట్టనంత స్కోరును జింబాబ్వే భారత్‌పై సాధించడం గమనార్హం. అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీసినప్పటికీ, శివం దూబే (2 ఓవర్లలో 46 పరుగులు) వంటి వారు ధారాళంగా పరుగులు ఇవ్వడం సెమీస్ చేరే జట్టుకు ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా బుమ్ర వికెట్లు తీయలేదు.

జింబాబ్వే బ్యాటర్ బ్రయన్ బెన్నెట్ (97) భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి సెంచరీకి చేరువయ్యాడు. ఒకానొక దశలో జింబాబ్వే గట్టి పోటీ ఇవ్వడం భారత బౌలింగ్ లైనప్‌లోని లోపాలను బయటపెట్టింది. ఫీల్డింగ్ లో కూడా కొన్ని పొరపాట్లు జరగడం చూస్తుంటే, పెద్ద జట్లతో ఆడేటప్పుడు ఇలాంటి నిర్లక్ష్యం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికా సెమీస్‌కు క్వాలిఫై అవ్వగా, జింబాబ్వే టోర్నీ నుండి నిష్క్రమించింది. ఇప్పుడు అసలైన పోరు వెస్టిండీస్‌తోనే. విండీస్ హిట్టర్లను అడ్డుకోవాలంటే భారత బౌలర్లు తమ వ్యూహాలను మార్చుకోవాలి. కేవలం భారీ స్కోర్లు చేస్తే సరిపోదు, ఈజీగా గెలవాలి అంటే ప్రత్యర్థులను తక్కువ స్కోరుకే కట్టడి చేయాల్సి ఉంటుంది. మరి మార్చి 1న జరిగే చావోరేవో తేల్చుకునే మ్యాచ్‌లో మన బౌలర్లు ఎలా పుంజుకుంటారో చూడాలి.

Related Post

Koragajja Audio Launch Creates Buzz in Mangaluru, Film Release SoonKoragajja Audio Launch Creates Buzz in Mangaluru, Film Release Soon

The much-awaited Kannada film Koragajja is making headlines after its grand audio launch event held in Mangaluru. The ceremony drew massive crowds and created a festive atmosphere, setting the tone

‘దురంధర్’కు కార్పొరేట్ బుకింగ్స్… దర్శకుడి పంచ్‘దురంధర్’కు కార్పొరేట్ బుకింగ్స్… దర్శకుడి పంచ్

ఏడాది చివర్లో బాక్సాఫీస్ వేటకు వచ్చి, సంచలన వసూళ్లు సాధించిన ‘దురంధర్’ సినిమా.. 2025 హైయెస్ట్ గ్రాసర్ రికార్డును సొంతం చేసుకుంది. అంతే కాక ఈ ఏడాది వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ‘దురంధర్’ రికార్డు సాధించే దిశగా