hyderabadupdates.com movies మణిరత్నంతో సాయిపల్లవి – సేతుపతి సినిమా ?

మణిరత్నంతో సాయిపల్లవి – సేతుపతి సినిమా ?

పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే తీసుకొచ్చింది. ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత నాయకుడు కాంబినేషన్ రిపీట్ చేస్తే ఇలాంటి దారుణమైన సినిమా ఇచ్చారేమిటని మూవీ లవర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. ఏదో యావరేజ్ అనిపించుకున్నా ఓకే కానీ మరీ ట్రోలింగ్ లెవెల్ లో ఆ మూవీ పోయింది. దాని తర్వాత మణిరత్నం నుంచి ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. నవీన్ పోలిశెట్టి, శింబు పేర్లు తొలుత వినిపించాయి. కానీ అవి నిజం కాలేదు. తాజాగా ఒక క్రేజీ కాంబోని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

విజయ్ సేతుపతి – సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో మణిరత్నం ఒక ప్రాజెక్టుని ప్లాన్ చేసినట్టు చెన్నై టాక్. నూతన సంవత్సర సందర్భంగా వచ్చే నెల ప్రకటించి అదే నెలలో షూటింగ్ కు వెళ్లేలా ప్లానింగ్ జరుగుతోందట. ప్రస్తుతం రామాయణ తప్ప ఇంకెవరికి కమిట్ మెంట్ ఇవ్వని సాయిపల్లవి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే కంటెంట్ ఏదో నమ్మొచ్చు అనేలా ఉంది. విజయ్ సేతుపతి ఆయనతో పని చేయడం మొదటిసారి కాదు. గతంలో చిక్క చివత వనం (తెలుగులో నవాబ్) చేశాడు. పెద్దగా రిజల్ట్ రాలేదు కానీ తమిళంలో ఘోరంగా అయితే పోలేదు. ఆ టైంలో సేతుపతికి ఇప్పుడున్నంత ఇమేజ్ లేదు.

కలయిక బాగుంది కానీ మణిరత్నం ఎలాంటి కథ రాసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ సమయంలో తన దగ్గర ఒక రొమాంటిక్ స్క్రిప్ట్ ఉందని, సఖి – ఓకే బంగారం తరహాలో ఫ్రెష్ గా ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు విజయ్ సేతుపతి – సాయిపల్లవి లాంటి పెర్ఫార్మర్లకు ఆ జానర్ సూట్ కాదు. సో ఏదో వేరే స్టోరీ అయ్యుంటుందనుకోవచ్చు. ప్రస్తుతానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. పూరి జగన్నాథ్ తో స్లమ్ డాగ్ (ప్రచారంలో ఉన్న టైటిల్) పూర్తి చేసిన విజయ్ సేతుపతి దాంతో పెద్ద బ్రేక్ దక్కుతుందనే నమ్మకంతో ఉన్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Related Post

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై చేద్దామని రెడ్ లో నటిస్తే పెద్దగా పట్టించుకోలేదు. ఇలా కాదు బోయపాటిని నమ్ముకుంటే తిరుగుండదని స్కంద చేస్తే అది కూడా

ఓజీ నిర్మాత‌తో గొడ‌వ‌.. సుజీత్ ఏమ‌న్నాడంటే?ఓజీ నిర్మాత‌తో గొడ‌వ‌.. సుజీత్ ఏమ‌న్నాడంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్లో హైయెస్ట్ గ్రాస‌ర్‌గా రికార్డు నెల‌కొల్పింది ఓజీ సినిమా. అభిమానుల‌కు విందు భోజ‌నం లాంటి సినిమాను అందించి వాళ్లకు దేవుడిలా మారిపోయాడు సుజీత్. ఈ సినిమాతో నిర్మాత డీవీవీ దాన‌య్య కూడా మంచి లాభాలే అందుకున్న‌ట్లు